Juice For Skin Whitening: చర్మం ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. మన జీవనశైలి, ఆహారం, ఒత్తిడి ఇవన్నీ చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని కరాణాల వల్ల చర్మం పైన మొటిమలు, మచ్చలు, పొడి బారడం వంటి సమస్యలు కలుగుతాయి.  ముఖ్యంగా ముఖాన్ని ఎక్కువగా తాకడం వల్ల బ్యాక్టీరియా వ్యాపించి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర పోయే ముందు మేకప్‌ను పూర్తిగా తీయకపోతే చర్మం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది.  జిడ్డుగల జుట్టు ముఖానికి తగిలితే మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే కొన్ని రకాల జ్యూస్‌లను తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి జ్యూస్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జ్యూస్‌ తయారు చేయడానికి కొన్ని రకాల  పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి చర్మం కాంతివంతంగా, మొటిమలు లేకుండా చేయడంలో ఎంతో సహాయపడుతాయి. ఇందులో  ఉండే పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, విటమిన్‌ కె,సి,ఎ వంటి పోషకాలు చర్మంను రక్షిస్తాయి. కొల్లాజెన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో సహాయపడుతుంది. ఇది చర్మం పైన సమస్యలు కలగకుండా ఉండేలా చేస్తాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. 


జ్యూస్‌ తయారీ కోసం కీరదోస, క్యారెట్‌, బీట్‌రూట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కులుగా కట్‌ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌ తీసుకొని అందులో దానిమ్మగింజలు వేసుకోవాలి. ఇందులో కట్‌ చేసిన పదార్థాలు కూడా కలుపుకోవాలి. ఈ పదార్థాలు అన్ని మెత్తగా అయిన తరువాత జ్యూస్‌ గ్లాస్‌లో తీసుకోవాలి. ఇలా ఇరువై ఒక రోజుల పాటు చేయడం వల్ల చర్మ సమస్యలు అన్ని మాయం అవుతాయి. దీని తీసుకొనే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా మంచిది. 


చర్మ సమస్యలను నివారించడానికి మరికొన్ని చిట్కాలు:


ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం: 


పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, చక్కెర, కొవ్వు ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.


నీరు ఎక్కువగా తాగడం:


 రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగాలి.


మంచి నిద్ర:


 ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవాలి.


వ్యాయామం:


రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి.


ఒత్తిడిని నిర్వహించడం:


 యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.


చర్మాన్ని శుభ్రంగా ఉంచడం:


 రోజుకు రెండుసార్లు మంచి క్లెన్సర్‌తో ముఖం కడగాలి.


మాయిశ్చరైజర్ వాడడం:


చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ వాడాలి.


సన్‌స్క్రీన్ వాడడం:


 ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ వాడాలి.


హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమలు వస్తే ఏం చేయాలి?


ఎండోక్రినాలజిస్ట్‌ని సంప్రదించండి: హార్మోన్ల సమతుల్యతను సరిచేయడానికి ఎండోక్రినాలజిస్ట్‌ని సంప్రదించండి.


ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి: ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర అలవాట్లు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి