Health Benefits & Side effexts of Juice: ప్రతిరోజూ క్రమం తప్పకుండా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైన దుష్ప్రభావం పడదు. పోషకాలతో నిండి ఉండే జ్యూస్ వల్ల సదా ఆరోగ్యంగా ఉంటారు. రోజూ జ్యూస్ తాగడం వల్ల ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా పండ్లు, కూరగాయలు జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తి పెంచడంలో దోహదపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని కణాల నిర్మాణం, డెడ్ సెల్స్ కారణంగా తలెత్తే నష్టాన్ని నివారించేందుకు ఉపయోగపడతాయి. జ్యూస్ క్రమం తప్పకుండా తాగడజం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే పంచదార అధికంగా ఉండే జ్యూస్‌కు దూరంగా ఉంటే మంచిది.


కొన్ని రకాల జ్యూస్‌లు ముఖ్యంగా స్వీట్ ఎక్కువ మోతాదులో ఉండేవి తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల ఎనర్జీ లోపం తలెత్తుతుంది. ఇన్సులిన్ నిరోధకతకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే డయాబెటిస్ రోగులు అరటి, మామిడి, సపోటా, పనస, శీతాఫలాలకు దూరంగా ఉండాలంటారు వైద్యులు.


జ్యూస్‌లో కేలరీలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ప్రత్యేకించి పంచదార మిక్స్ చేసుకుని తాగితే మంచిది కాదు. అంటే కేలరీలు పెరగడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. పంచదార ఎక్కువగా ఉండే జ్యూస్ సేవించడం వల్ల పళ్లకు మంచిది కాదు. ఇందులో ఉండే పంచదార మీ నోట్లో బ్యాక్టీరియాను పెంచుతుంది. దంత సమస్యలు తలెత్తుతాయి.


Also read: Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపముంటే ఏం జరుగుతుంది, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook