Kale for Weight Loss In 25 Days: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ను సూపర్‌ఫుడ్స్‌ అంటారు. ఎందుకంటే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆకు కూరల్లో కాలేతో పాటు గోబి ఎక్కువగా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వాటిని సలాడ్స్‌లో ఎక్కువగా తినడం వల్ల బరువుతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాలేను సలాడ్స్‌లో ఎక్కువగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


బరువు తగ్గుతారు:


ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో  కాలే సలాడ్‌ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య  సమస్యలు కూడా తగ్గుతాయి.


గుండెపోటు సమస్యలకు చెక్‌:


కాలేలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి. దీని కారణంగా సిరల్లో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి గుండె పోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కాలే ప్రతి రోజూ సలాడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.


క్యాన్సర్:


క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి.. ప్రస్తుతం చాలా మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మొదటి స్టేజీలో క్యాన్సర్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కాలేను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్ కారక కణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు తీవ్ర క్యాన్సర్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.


కంటిచూపు మెరుగుపడుతుంది:


కాలేలో విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తాయి.  కంటి చూపును పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రేచికటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కాలే సలాడ్‌ను ప్రతి రోజూ తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.


ఎముకలు బలంగా మారుతాయి:


కాలేలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కాలేను తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా ఎముకల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా దీనిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్


Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook