Kidney Health: చావు ఎప్పుడు చెప్పి రాదు అంటుంటారు.. అనారోగ్యం కూడా అంతే.. కొన్నిసార్లు సడెన్‌గా రావొచ్చు. అయితే కొన్ని వ్యాధులకు సంబంధించి అనారోగ్య లక్షణాలను మనం ముందే గుర్తించవచ్చు. వ్యాధి ముదరక ముందే దాన్ని గుర్తించడం ద్వారా సకాలంలో వైద్య సాయం పొంది మళ్లీ ఆరోగ్యవంతంగా మారవచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీ వ్యాధుల సమస్యలతో బాధపడుతున్నారు. ఆల్కహాల్, అధిక రక్తపోటు, మధుమేహం కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. అసలు కిడ్నీ వ్యాధిని తొలి దశలోనే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిడ్నీ ఫెయిల్యూర్... లక్షణాలివే :


మూత్ర విసర్జన తగ్గడం
కీళ్ల నొప్పులు
తలనొప్పి ఉండటం
శరీరం దురద పెట్టడం
రోజంతా అలసిపోవడం
రాత్రి నిద్రపోవడంలో ఇబ్బంది
బరువు తగ్గడం లేదా ఆకలి లేకపోవడం
శారీరక బలహీనత
జ్ఞాపకశక్తి కోల్పోవడం
ఏకాగ్రత లేకపోవడం


'మూత్రం రంగు' గమనించండి :


మూత్రం రంగు మీ కిడ్నీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. మూత్రం రంగులో తేడా గమనిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇది రాను రాను కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీయవచ్చు. కాబట్టి వెంటనే కిడ్నీ స్పెషలిస్టును సంప్రదించాలి.


మూత్రం రంగు.. దాని సంకేతాలు :


స్పష్టమైన లేదా లేత పసుపు రంగు - శరీరం బాగా హైడ్రేట్‌గా ఉందని సంకేతం.
ముదురు పసుపు రంగు - శరీరం డీహైడ్రేషన్‌కి గురైనట్లు సంకేతం.
నారింజ రంగు - శరీరంలో నీటి శాతం తగ్గిందనడానికి సంకేతం.
పింక్ లేదా ఎరుపు రంగు - మూత్రంలో రక్తం రావడం లేదా స్ట్రాబెర్రీలు, బీట్‌రూట్ వంటి ఆహారాలు తినడం వల్ల కూడా కావొచ్చు.
మూత్రంలో నురుగు - మూత్రంలో ప్రోటీన్ సంకేతం, ఇది కిడ్నీ వ్యాధికి సంకేతం. 


Also Read: TG Traffic challan: నేడే లాస్ట్​ డేట్​- మీ వాహనాలపై పెండింగ్ చలాన్​లు​ చెల్లించారా..?


Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు... ఇదిగో ఇలా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook