మనం తినే ఆహారంలో వ్యర్ధాల్ని తొలగించి బయటకు పంపిస్తుంటుంది. యూరిన్ ద్వారా వ్యర్ధాలు బయటకు ఫిల్టర్ అవుతుంటాయి. కడ్నీలు సక్రమంగా పనిచేస్తున్నంతవరకే శరీరంలో అన్ని వ్యవస్థలు బాగుంటాయి. కిడ్నీలు పాడైతే వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అతి తీవ్రమైన దశ. ఓ విధంగా చెప్పాలంటే ప్రాణాంతకం కూడా. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తినే ఆహార పదార్ధాలు జీర్ణం కావడంలో ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల కిడ్నీ సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుకే కిడ్నీలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి లేదా మితంగా తీసుకోవాలి.


కిడ్నీలపై దుష్ప్రభావం చూపించే పదార్ధాలు


అరటి


అరటిలో పొటాషియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా కిడ్నీలో సమస్యలు ఏర్పడతాయి. కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతుంటే..అరటి పండ్లను పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అరటి పండ్లు తినడం వల్ల కిడ్నీ సమస్య జటిలం కావచ్చు.


తొక్కతో కూడిన బంగాళదుంపలు


చాలామంది బంగాళదుంపల్ని తొక్కతో సహా తింటుంటారు. ఈ అలవాటు మీ కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నెమ్మది నెమ్మదిగా కిడ్నీలను పాడు చేస్తుంది. అందుకే బంగాళదుంపల్ని ఎప్పుడూ తొక్క ఒల్చి తినాలి.


టొమాటో


రోజూ టొమాటో అదే పనిగా ఎక్కువ మోతాదులో తినడం చేస్తుంటే అది మీ కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. టొమాటో ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయి. కారణం టొమాటోల పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది కిడ్నీల్ని పాడు చేస్తుంది. 


పాలు,పెరుగు


పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తుల్ని కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు అస్సలు తినకూడదు. దీనివల్ల కిడ్నీలో సమస్య ఏర్పడుతుంది. పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే కిడ్నీపై ఒత్తిడి పెరిగి పాడయ్యే అవకాశలుంటాయి.


పప్పులు


పప్పుల్లో చాలా రకాల న్యూట్రియంట్లు ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పప్పు వినియోగం తగ్గించాలి. ఎందుకంటే పప్పులు త్వరగా జీర్ణం కావు. వీటిని జీర్ణం చేయాలంటే కిడ్నీలు అధిక ఒత్తిడికి గురవుతాయి. కిడ్నీల పనితీరు సరిగ్గే లేనప్పుడు ఇది దుష్ప్రభావం చూపిస్తుంది. 


Also read: Reduce Weight Loss, Belly Fat: ఈ అద్భుతమైన కాఫీతో శరీర బరువును, బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook