Stone Problem: కిడ్నీల్లో రాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. కేవలం 5 నిమిషాల్లో ఇలా ఉపశమనం పొందండి..
Kidney Stones Pain: ప్రస్తుతం చాలా మంది కిడ్నీల్లో రాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి నలుగురిలో ఒక్కరు ఇలాంటి సమస్య బారిన పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Kidney Stones Pain: ప్రస్తుతం చాలా మంది కిడ్నీల్లో రాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి నలుగురిలో ఒక్కరు ఇలాంటి సమస్య బారిన పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలా మందిలో రాళ్లు కిడ్నీల్లోనే కాకుండా ఇతర అవయవాల్లో కూడా ఏర్పడడం విశేషం. ఈ నొప్పులతో బాధపడేవారిలో మూత్ర సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాళ్లు చాలా మందిలో మూత్ర నాళాల్లో ఇరుక్కుపోయి.. మూత్రం రావడం ఆగిపోతోంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పలు రకాల చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాళ్ల సమస్యతో బాధపడే వారు పలు ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తప్పకుండా ఈ ఆహారాలను తీసుకోవాలి:
బ్రోకలీ:
కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారికి కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. వీటి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు లభించడమేకాకుండా రాళ్ళు ఏర్పడకుండా సంరక్షిస్తుంది. అయితే దీని కోసం తప్పకుండా మీరు బ్రోకలీ ఇతర కూరగాయాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పోషకాల పరిమాణం చాలా అధికంగా ఉంటాయి. కావున రాళ్లను నియంత్రించడానికి సహాయపడుతుంది.
క్యాప్సికమ్:
కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా క్యాప్సికమ్స్‌ను ఆహారంలో తీసుకోవాలి. ఇందులో అధిక పరిమణాల్లో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ ఎ, కె, బీటా కెరోటిన్ ఉంటాయి. అంతేకాకుండా కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కావున ఇవి బరువును తగ్గించడమేకాకుండా బాడీని ఫిట్‌గా చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లను నియంత్రించడానికి సహాయపడతాయి.
అరటిపండు:
అరటిపండులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్లను తగ్గించడానికి కూడా సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున రాళ్ల సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా అరటిపండ్లను తీసుకోవాలి. ఇందులో కాల్షియం పరిమాణం కూడా అధికంగా ఉంటుంది. కావున రాళ్లను సులభంగా నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. రాళ్ల సమస్యలతో బాధపడేవారు రోజుకు తప్పకుండా 1 నుంచి 2 రెండు అరటి పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook