Cholesterol Control Foods: ఆహారాల్లో వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టొచ్చు..

Cholesterol Control Foods: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు తీసుకునే అనారోగ్యం వల్లేనని నిపుణులు తెలుపుతున్నారు. ఆయిల్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు.

  • Aug 24, 2022, 17:59 PM IST

Cholesterol Control Foods: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు తీసుకునే అనారోగ్యం వల్లేనని నిపుణులు తెలుపుతున్నారు. ఆయిల్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆహారంలో చిన్న చిన్న మార్పుల వల్ల చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

1 /5

చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కూరగాలు, ఇతర పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ స్థాలను నియంత్రించడానికి తప్పకుండా ఆకు కూరలను తీసుకోవాలి.  

2 /5

పసుపు శరీరానికి చాలా మంచిది. ఇది వివిధ రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే పసుపుతో కలిపిన పాలను రాత్రి పడుకునే ముందు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ సులభంగా వెన్నెల కరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

3 /5

యాపిల్స్, బెర్రీలు, నారింజ, నిమ్మకాయలను సిట్రస్ పండ్లు అంటారు. వీటిని రోజూ తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలగడమేకాకుండా.. బాడీలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది. కావున బరువు పెరగడం, కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడే వారు వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

4 /5

కూరగాల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా వీటిని రోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా నిపుణులు సూచించిన ఆహారాలను తీసుకోవాలి.

5 /5

వెల్లుల్లిలో శరీరానికి శక్తినిచ్చే చాలా రకాల పోషక విలువలుంటాయి. వీటిని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులను సులభంగా తగ్గిస్తుంది. గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.