Kitchen Hacks: వివిధ రకాల కళల్లో వంట ఓ అద్భుతమైన కళ. ఒక్కొక్కరి వంట ఒక్కోలా ఉంటుంది అందుకే. కొన్ని రకాల వస్తువుల్ని బట్టి వండే వంట రుచి మారుతుంటుంది. రోజూ తినే వంటకాల రుచిని మరింత అద్భుతంగా మార్చాలంటే ఏం చేయాలో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మసాలా దినుసులు భారతీయ వంటలకు ఓ ఆభరణం లాంటివి. వంటలకు అదనపు ఫ్లేవర్, రుచి అందిస్తుంటాయి. అదే సమయంలో ఈ మసాలా దినుసులు ఆరోగ్యానికి కూడా మంచివి. రోజూ వండే వంటలకు అదనపు రుచి అందించాలంటే ఏయే మసాలా దినుసులు వాడాలో ఇప్పుడు పరిశీలిద్దాం.


కసూరీ మేథీ అనేది ఓ అద్భుతమైన ఔషధం లాంటిది. రోజూ వండే కూరగాయలు, పప్పు వంటి వంటకాల్లో కసూరీ మేథీ వాడటం వల్ల అదనపు రుచి వస్తుంది. కసూరి మేథీకు ఉండే సువాసన ఘాటుగా ఉంటుంది. అందుకే వండే ఆహారంలో సులభంగా కలుస్తుంది. ఫలితంగా వంటకు అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.


గరమ్ మసాలా అనేది చాలా రకాల మసాలా దినుసుల్ని కలిపి పౌడర్‌గా చేస్తారు. ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో వాడుతుంటారు కానీ సాధారణంగా రోజూ వండే కూరగాయలు, పప్పు వంటి వంటకాల్లో కూడా వేయవచ్చు. మీ రెగ్యులర్ కూరల రుచిని పెంచుతుంది. రోజూ తినే కూరే అయినా అద్భుతంగా ఉంటుంది. 


కరివేపాకు దక్షిణాది వంటకాల్లో తప్పకుండా వాడే పదార్ధం. కరివేపాకు వేయకుండా దక్షిణాదిన ఏ విధమైన వంటలుండవు. కరివేపాకు అనేది రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆహారంలో విభిన్నమైన సువాసన, మెరుగైన పోషక గుణాల్ని అందిస్తుంది. 


పెద్ద ఇలాచీ అనేది చాలా తక్కువమంది వినియోగిస్తుంటారు కానీ అద్భుతమైన పదార్ధం. మీ వంట రుచిని మార్చేస్తుంది. అద్భుతమైన పరిమళాన్నిస్తుంది. 


Also read: Khichidi Benefits: ఖిచిడీ తింటే..వర్షాకాలంలో వచ్చే ఆ రోగాలు దూరం



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook