Knee Pains: సాధారణంగా మోకాలి నొప్పులనేవి వృద్ధాప్యంలో ఎదురవుతుంటాయి. కానీ ఆధునిక జీవనశైలి లేదా ఆహారపు అలవాట్ల కారణంగా యుక్త వయస్సులో కూడా ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఈ సమస్య కారణంగా సాధారణ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ఏ పనీ చేయలేకపోతుంటారు. ఇన్ స్టంట్ రిలీఫ్ కోసం చాలామంది పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు కానీ ఇది మంచిది కానే కాదు. కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు పాలు


మోకాలు నొప్పులు లేదా మోకాళ్లు పట్టేసినట్టుంటే శరీరంలోపల అంతర్గతంగా సమస్య ఉందని అర్ధం. అందుకే పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే చాలా రకాల సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. పసుపు పాలు ఆరోగ్య రీత్యా చాలా మంచివి. పసుపులో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. శరీరంలో ఉండే ఇతర సమస్యలు కూడా దూరమౌతాయి. రాత్రి వేళ పడుకునే ముందు తాగితే మంచి ఫలితాలుంటాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కొన్ని రోజుల్లోనే ఫలితం కన్పిస్తుంది. 


డ్రై ఫ్రూట్స్


డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మోకాలు నొప్పుల సమస్య కూడా మాయమౌతుంది. డ్రై ఫ్రూట్స్ స్వభావం వేడిమి కావడంతో నొప్పిని దూరం చేస్తాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు కూడా మంచిది. 


మెంతులు


సాధారణంగా మెంతుల్ని వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ మెంతి నీరు తాగుతుంటారు. అజీర్తి సమస్యకు కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. వంటల్లో అయితే రుచి కోసం వాడుతుంటారు. కానీ మోకాలు నొప్పులు, మోకాలు పట్టేసినట్టుంటే మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. రోజూ రాత్రి వేళ ఓ గ్లాసు నీళ్లలో మెంతులు నానబెట్టి ఉదయం వాటిని క్రష్ చేసి నీళ్లతో సహా తీసుకోవాలి. ఇలా చేస్తే మోకాలు నొప్పుల సమస్యలు పోతాయి.


Also read: Smart Bra: బ్రెస్ట్ కేన్సర్ నుంచి గ్రేట్ రిలీఫ్, 1 నిమిషంలోనే వ్యాధిని పసిగట్టే బ్రా సిద్ధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook