Smart Bra: ఇటీవలి కాలంలో బ్రెస్ట్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఆలస్యంగా గుర్తిస్తుండటంతో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మహిళల్లో ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదిక. బ్రెస్ట్ కేన్సర్ ను ప్రారంభదశలో గుర్తించగలిగే విధానం అందుబాటులో వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రెస్ట్ కేన్సర్ అనేది మహిళల్లో ఎదురయ్యే అతి పెద్ద సమస్య.చాలాకాలంగా మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఐఐటీ కాన్పూర్ విభాగం విద్యార్థి పరిష్కారం కనుగొన్నట్టు కన్పిస్తోంది. ఆ విద్యార్థి స్వయంగా అభివృద్ధి చేసిన ఓ బ్రా..బ్రెస్ట్ కేన్సర్ కనుగొనేందుకు చాలా సహాయపడుతుంది. కాన్పూర్ ఐఐటీ విద్యార్థి శ్రేయా నాయర్ ప్రొఫెసర్ అమితాబ్ బందోపాధ్యాయ నేతృత్వంలో ఈ స్మార్ట్ బ్రాను రూపొందించాడు. బ్రెస్ట్ కేన్సర్ వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణం సకాలంలో గుర్తించలేకపోవడమే. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ బ్రా తయారు చేశాడు.
ఈ స్మార్ట్ బ్రా పని తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఓ ప్రత్యేకమైన సెన్సార్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ లో కన్పించే వివిధ రకాల మార్పుల్ని పసిగడుతుంది. బ్రెస్ట్ కేన్సర్ లో కన్పించే ప్రారంభ లక్షణాల్ని ఇది వెంటనే పసిగట్టి అలర్ట్ చేస్తుంది. దాంతో వెంటనే చికిత్స చేయించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ బ్రా ప్రోటో టైప్ తయారైంది. క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఈ బ్రాను నిరంతరం ధరించి ఉండాల్సిన అవసరం లేదు. రోజుక ఒక నిమిషం సేపు ధరిస్తే చాలు. ఈ బ్రాతో మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి ఉంటుంది. మొత్తం డేటా సిద్ధం చేస్తుంది. ఈ బ్రాలో ఉండే సెన్సార్ ఏదైనా అసాధారణ మార్పులు కన్పిస్తే మొబైల్ కు ఎస్ఎంఎస్ పంపిస్తుంది. తక్షణం వైద్యుని సంప్రదించాల్సిందిగా సూచిస్తుంది.
ప్రస్తుతం ఈ బ్రా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా విజయవంతమైతే ఏడాదిలోగా మార్కెట్ లో విడుదల కావచ్చు. ఈ బ్రా ఖరీదు దాదాపుగా 5 వేలుండవచ్చు.ఇప్పటి వరకూ ఈ తరహా డివైస్ ఏదీ మార్కెట్ లో లేదు. ఈ స్మార్ట్ బ్రా అందుబాటులోకి వస్తే కచ్చితంగా ఇదొక గేమ్ ఛేంజర్ కావచ్చు.
Also read: Vitamin B12 Rich Foods: ఈ 5 ఫుడ్స్ తీసుకోకుంటే విటమిన్ బి 12 లోపంతో శరీరం గుల్లయిపోతుంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook