Tulsi Water Benefits: తులసి నీళ్లు చల్లడం కాదు..తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా
Tulsi Water Benefits: తులసి మొక్క. అత్యద్భుతమైన ఔషధ మొక్క. తులసి గింజలు, ఆకులే కాదు..తులసి నీరు కూడా ఓ దివ్యౌషధమే. తులసి నీళ్లతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Tulsi Water Benefits: తులసి మొక్క. అత్యద్భుతమైన ఔషధ మొక్క. తులసి గింజలు, ఆకులే కాదు..తులసి నీరు కూడా ఓ దివ్యౌషధమే. తులసి నీళ్లతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
పరగడుపున తులసి నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. ఆ ప్రయోజనాలేంటేది ఊహించలేరు కూడా. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిగా భావించే తులసి మొక్కతో ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. తులసిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తులసి మొక్క ఉపయోగపడుతుంది. తులసి మొక్క ఆకులు, గింజలే కాకుండా తులసి నీరు కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది. అదేంటో చూద్దాం. ( Tulsi water and seeds and leaves benefits)
ప్రతిరోజూ తులసి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలుంటాయి. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలో సహయపడుతుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి తులసి ఉపశమనం కల్పిస్తుంది. వర్షాకాలంలో పసుపు, తులసి కషాయం తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా..గొంతులో గరగర, గొంతు నొప్పి.. ఇతర సమస్యలు దూరమవుతాయి.
కొబ్బరి నీళ్లు, తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో ఎసిడిటి ఉన్నవారు ప్రతి రోజూ రెండు నుంచి మూడు తులసి ఆకులను తినాలి. అలాగే పొద్దున్నే తులసి నీరు తాగడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్ పెట్టవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తులసి నీరు తాగవచ్చు. దీనివలన బాడీలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే తులసి నీరు తాగడం వలన జ్వరం, వైరల్ ఫీవర్స్ దరిచేరవు. మలబద్ధకం, విరేచనాల సమస్యను నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Dark Circles: కంటి కింది నల్లటి వలయాలకు అద్భుతమైన ఇంటింటి చిట్కాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook