Anxiety and Panic Attack: యాంగ్జైటీ ఎటాక్, పానిక్ ఎటాక్‌లో అంతరం ఏంటి, ఎలా తెలుసుకోవడం
Anxiety attack,Panic attack రెండింటికీ అంతరం చాలామందికి తెలియదు. ఫలితంగా మరింత ఆందోళనకు గురవుతుంటారు. ఈ రెండింటి మధ్య అంతరాన్ని ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం..
యాంగ్జైటీ ఎటాక్ వర్సెస్ పానిక్ ఎటాక్. రెంటి మధ్య అంతరం తెలుసుకోవాలంటే..అదెలా ఉంటుంది, వాటి తీవ్రత ఎలా ఉంది, ఎంత సమయం ఉందనే వివరాల్ని బట్టి అంచనా వేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
చాలామంది Anxiety attack,Panic attack మధ్య అంతరం తెలుసుకోవడంలో పొరబడుతుంటారు. ఎందుకంటే రెండింట్లోనూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వాటి వాటి తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఎలా ఉంది, వాటి తీవ్రత ఎంత ఉంది, ఎంత సమయం వరకూ ఉంటుందనే వివరాల ఆధారంగా ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. పానిక్ ఎటాక్, యాంగ్జైటీ ఎటాక్ అంటే అర్ధంలోనూ శారీరక లక్షణాల్లోనూ ఒకటేలా ఉంటాయి. ఒకేసారి రెండింటినీ చవిచూడవచ్చు కూడా. అయితే పాథలాజికల్ రూపంలో రెండింటికీ కారణం ఒకటే కాదు. పానిక్ ఎటాక్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. శారీరక లక్షణాలు కన్పిస్తాయి. అందుకే రెండింటికీ మధ్య అంతరాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
యాంగ్జైటీ ఎటాక్
యాంగ్జైటీ ఎటాక్‌లో సాధారణంగా భవిష్యత్‌లో జరిగే ఏదైనా ప్రత్యేక సమస్య పట్ల భయం ఉంటుంది. ఇది నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది. ఆ వ్యక్తికి అంతిమ రోజులు కూడా గుర్తొచ్చేస్తాయి. అప్పుడప్పుడూ బాధ, ఒత్తిడికి లోనయ్యేవారిని సులభంగా గుర్తించలేం. లక్షణాల్లో ఎక్కువ బాధ, చికాకుతో పాటు గుండె దడ వంటి శారీరక లక్షణాలుండవచ్చు. యాంగ్జైటీ ఎటాక్ అనేది పానిక్ ఎటాక్ అంత తీవ్రంగా ఉండదు. నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ దీర్ఘకాలం ఉంటుంది.
పానిక్ ఎటాక్
పానిక్ ఎటాక్ ఏ సంకేతం లేకుండా రావచ్చు. యాంగ్జైటీ ఎటాక్‌తో పోలిస్తే పానిక్ ఎటాక్‌లో కాస్సేపట్లోనే కోలుకోగలరు. ప్రశాంతంగా, స్థిమితంగా కూర్చుంటే ఇది సాధ్యమౌతుంది. పానిక్ ఎటాక్ ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జైటీ డిజార్డర్‌తో మిళితమై ఉంటుంది. పానిక్ ఎటాక్ పలు మానసిక పరిస్థితులతో కలిసి ఉంటుంది. యాంగ్జైటీ ఎప్పుడూ పీక్స్‌లో ఉండదు. కానీ నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటుంది. అదే పానిక్ ఎటాక్ మాత్రం 10-15 నిమిషాల వరకూ ఉంటుంది. చాలా సందర్భాల్లో క్షణాల్లోనే పీక్స్‌కు చేరుకుంటుంది. పానిక్ ఎటాక్ అనేది యాంగ్జైటీ లక్షణం కావచ్చు.
పానిక్ ఎటాక్ లక్షణాలు
యాంగ్జైటీ ఎటాక్‌తో పోలిస్తే పానిక్ ఎటాక్ గురైన వ్యక్తికి మెడికల్ ఇబ్బందుల్లో ఉన్నట్టుంటుంది. గుండెపోటు వంటి పరిస్థితి ఎదురుకావచ్చు. పానిక్ ఎటాక్‌లో వ్యక్తికి హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది. చెమట ఎక్కువగా పడుతుంది. తల తిరగవచ్చు. ఈ లక్షణాలున్నప్పుడు మెడికల్ ఎయిడ్ అవసరముంటుంది. యాంగ్జైటీ ఎటాక్ సాధారణంగా మానసికంగా ఉంటుంది. అర్ధపర్ధం లేని ఆలోచనల్ని నియంత్రించలేరు. అధికంగా ఆలోచించడం, మానసిక అలసట, శారీరక అలసట ఉంటాయి.
Also read: Acidity Home Remedies: అసిడిటీ సమస్యకు శాశ్వతంగా ఈ చిట్కాలతో గుడ్ బై చెప్పండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook