Side Effects of Brinjals |  వంకాయను ఏడాది పొడవునా తీసుకుంటారు. చాలా మందికి వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తెలుగు వంటకాల్లో కూడా వంకాయ తప్పనిసరి. ప్రతీ వేడుకలు వంకాయ టమాట, వంకాయ ఆలూ, వంకాయ ఫ్రై, చట్నీ.. ఇలా ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తారు. నార్త్‌లో వంకాయలను మంటలపై కాల్చి మసాలా వేసి తింటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Health: జలుబు దగ్గును తగ్గించే 5 వంటింటి చిట్కాలు


వంకాయ గురించి పాటలు కూడా వచ్చాయి. తాజా కూరలలో రాజా ఎవరంటే అనే పాట కూడా వచ్చింది. అది మీరు వినే ఉంటారు. సాహిత్యంలో కూడా వంకాయ గురించి వర్ణణ ఉంది. అయితే ఏదైనా ఎక్కువ తీసుకుంటే దాని వల్ల ప్రమాదం ఉంటుంది అని.. అది నష్టం కలిగిస్తుంది అని మనకు తెలిసిందే. వంకాయ కూడా దానికి మినహాయింపు కాదు.. ఆరోగ్యం (Health) కాపాడుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.


అనారోగ్యం వస్తే
జ్వరంగా ఉన్నప్పుడు వంకాయను అసలు తీసుకోకూడదు. వంకాయ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే  ఫీవర్‌గా ఉన్నప్పుడు మీ డైట్‌లో వంకాయను అసలు భాగం చేయకండి. ఎలర్జీ కలిగే అవకాశం ఉంటుంది.



Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి


మధుమేహం ఉంటే
డయాబెటిస్ ఉన్న పేషెంట్లు వంకాయ నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే వంకాయ తినడం వల్ల రక్తంలో చెక్కర శాతం పెరుగుతుంది.


డైజెషన్ కోసం
వంకాయ తినడం వల్ల డైజషన్ మెరుగు అవుతుంది. ఇది మంచిదే కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట వచ్చే అవుతుంది.


మరో సమస్య
వంకాయను ఇష్టపడే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. వంకాయను తీసుకోవడం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం వస్తుంది.



Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి


బ్లడ్ ప్రెషర్
రక్తపోటు (Blood Pressure) సమస్య ఉన్న వాళ్లు వంకాయ నుంచి కాస్త దూరంగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook