COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kombucha Tea For Diabetes: అనారోగ్యకరమైన ఆహారాలు ఎంత డేంజరో అందరికీ తెలిసిందే. తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునేవారు ఎప్పటికో ఒకరోజు తప్పకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. కాబట్టి ఎంత అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది స్ట్రీట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు. అయితే దీనివల్ల చిన్నతనంలోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి జీవనశైలి అలవాటు పడ్డ వారిలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి మధుమేహం బారిన పడుతున్నారు. 


చిన్న వయసులోనే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు తరచుగా ఒత్తిడి, టెన్షన్ కు గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఓ టీని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


కొంబుచా టీని ప్రతిరోజు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ టీ ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపులో ఉంటాయట. డయాబెటిస్తో బాధపడుతున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా కొంబుచా టీని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇంతకీ మీకు కొంబుచా అంటే ఏమిటో తెలుసా తెలియకపోతే మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కొంబుచా అంటే ఏమిటి?
కొంబుచా అనేది పులియపెట్టిన బ్లాక్ టీ.. ఇందులో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వేసి, పండ్ల రసాలను జోడించి బాగా పులియబెడతారు. ఇలా టీ మొత్తం పులిచిన తర్వాత అందులో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. అయితే దీనినే ఇతర దేశాల ప్రజలు కొంబుచా టీ అని అంటారు. మరికొంతమంది ఫంగస్ టీ అని కూడా అంటారు. అయితే ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని సులభంగా రక్షిస్తుంది.


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి