Foods To Avoid For Healthy Heart: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా? మీ గుండె జాగ్రత్త మరి!
Unhealthy Foods For Heart: శరీరంలో ఉండే అవయవాల్లో గుండె కీలక ప్రాత షోషిస్తుంది. గుండె ఆగిపోతే మనిషి ప్రాణాలు పోయినట్లే. అందుకే ఆరోగ్యనిపుణులు గుండెను ఆరోగ్యంగా వుంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారు. అయితే కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని . ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం.
Unhealthy Foods For Heart: గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పోషకాలు కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మారిన జీవనశైలి కారణంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా గుండె నొప్పి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసం: ఆధునిక జీవనశైలిలో ముక్క లేనిది ముద్ద దిగకుండా పోయింది. అయితే ఈ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల కొవ్వు , చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
జంక్ ఫూడ్స్: ప్రస్తుతం ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ , చికెన్ నగెట్స్ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీని వల్ల గుండె బలహీనంగా మారుతుంది. కాబట్టి అతి తక్కువగా ఈ ఫూడ్స్ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
తీపి పదార్థాలు: అధికంగా స్వీట్స్ తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల గుండె సమస్యలు ఎక్కువగా రావడానికి ఛాన్స్‌లు ఉన్నాయి. వీటికి తక్కువగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Sprouted Seeds: మొలకెత్తిన గింజలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు!
చిరుతిండి: చిరుతిండి ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. ఈ పదార్థాల్లో ఎక్కువగా నూనె ఉండటం వల్ల గుండెకు మంచిది కాదు.
పాల ఉత్పత్తులు: పాలలో అధిక కొవ్వు ఉండటం వల్ల గుండె సమస్యలు అధికంగా వస్తాయి. దీనిని తీసుకోవడం ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఉప్పు: ఉప్పుతో ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. అధిక ఉప్పుతో కూడి పదార్థాలు తీసుకోవం వల్ల హై బీపీ సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
Also read: Foods For Healthy Ograns: మీ అవయవాలు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పదార్థాలు మేలు చేస్తాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter