keep your organs healthy: శరీరంలోని ప్రతి అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్లప్పుడు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలి . అవయవం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల పదార్థాలు ఉపయోగపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.
అవయవాల్లో కీలక ప్రాత పోషించేది గుండె ఒకటి. గుండె బలంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే టమోటాలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.
కండరాలు దృఢంగా ఉండాలి అంటే అరటి పండ్లు, చేపలు, మాంసం, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో చాలా మంది ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడి ఆరోగ్యం ఉండాలి అంటే బ్రొకోలి, మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో మంచిది.
పొట్టలోని ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలి అంటే పెరుగు, ఎండుద్రాక్ష తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇన్ఫ్‌క్షన్‌లు, మలబద్దకం వంటి సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదు.
కళ్లు మెరుగుగా కనిపించాలి అంటే ప్రతిరోజు గుడ్లు, మొక్కజొన్న, క్యారెట్‌లు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల కళ్లు బాగా కనిపిస్తాయి.
Also read: Basmati Rice Benefits: బాస్మతి బియ్యాన్ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో!
మెదడు చురుకుగా ఉండాలి అంటే వాల్ నట్స్, సాల్మన్ చేపను ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మతిమరుపు వంటి సమస్యలు తగ్గుతాయి.
జుట్టు ఆరోగ్యంగా , బలంగా ఉండాలి అంటే బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.
చివరిగా ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఆరెంజ్, పాలు, అరటిపండు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కీళ్ల నొప్పి, ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి.
ఈ విధంగా ఇక్కడ చెప్పిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Cucumber: దోసకాయ మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter