Liver Damage Foods: కొన్ని రకాల ఫుడ్స్ లివర్ కి ప్రమాదం. సాధారణంగా మనకు తెలిసి ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల లివర్ ప్రమాదంలో పడుతుంది అనుకుంటారు. కానీ అది తప్పు ఆల్కహాల్ మాత్రమే కాదు మరో ఆరు ఆహారంలో మీ డైట్ లో ఉంటే మీ లివర్ కచ్చితంగా ప్రమాదంలో పడినట్టే. ముఖ్యంగా ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల లివర్ మంటకు కారణం అవుతుంది. అంతేకాదు ఫ్రై, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా లివర్ కి ఎక్కువ ప్రభావం చూపుతాయి.  కాలేయంపై ఫ్యాట్ పేరుకు పోవడానికి ఇదే కారణం. అందుకే మన డైట్ లో సమతుల ఆహారం చేర్చుకోవాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ మీట్ ఇవన్నీ మన లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచివని వెబ్ ఎండి నివేదిక తెలిపింది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 6 ఆహారాలకు మాత్రం కచ్చితంగా దూరంగా ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆల్కహాల్..
అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది లివర్ సిర్రోసిస్ కి కారణం అవుతుంది. తరచూ బీరు ఒకే సిట్టింగ్ లో నాలుగు బీర్లు తీసుకునే వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది. అందుకే ప్రతిరోజు ఒక డ్రింక్ లేదా రెండిటికి మించి తీసుకోకూడదని వెబ్ ఎండి నివేదిక తెలిపింది.


ఉప్పు..
ఆల్కహాల్ మాత్రమే కాదు ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల కూడా మీ లివర్ ప్రమాదంలో పడుతుంది. ఇది ఫ్యాటీ లివర్ ఒబేసిటీ, డయాబెటిస్ కి కూడా కారణం అవుతుంది. అందుకే ఏ ఆహారమైన మితంగా తినాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల లింవర్ ప్రమాదంలో పడినట్లే.. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండే ఆహారాలే మీ డైట్ లో చేర్చుకోవాలి.


చక్కెర..
అతిగా చెక్కర తీసుకోవడం వల్ల డయాబెటీస్ సమస్య మాత్రమే కాదు. ఇది లివర్ కి కూడా ప్రమాదంగా మారుతుంది ఫ్యాటీ లివర్ సమస్య అభివృద్ధి కావడానికి కారణం అవుతుంది. అందుకే చక్కెరలో అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి అతిగా తినకూడదని వెబ్ ఎండి నివేదిక సూచించింది.


ఇదీ చదవండి: ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల 8 జబ్బులు నయమైపోతాయి..


రెడ్ మీట్..
రెడ్ మీట్లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్ లెవెల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. రెడ్ మీట్ అతిగా తీసుకోవడం వల్ల కార్డియో ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రెడ్‌ మీట్‌ కూడా మీ డైట్ లో ఉండకూడదు.


ట్రాన్స్‌ ఫ్యాట్‌..
ట్రాన్స్‌ ఫ్యాట్‌ అంటే ఆర్టిఫిషియల్ ఫ్యాట్. ముఖ్యంగా బేకరీ ఉత్పత్తుల్లో ఇవి విపరీతంగా కనిపిస్తాయి. బేకరీ ఉత్పత్తులు అతిగా తినడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు దీంతో బరువు కూడా పెరిగిపోతారు.


ఇదీ చదవండి: ఖాళీ కడుపున 4 పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే.. మీకు నమ్మశక్యం కాని ప్రయోజనాలు..


 సాఫ్ట్ డ్రింక్స్..
సాధారణంగా మనకు దాహం వేస్తే సడెన్‌గా సాఫ్ట్‌ డ్రింక్స్ తాగేస్తాం. కానీ  నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు ఇవే కారణం ఈ సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తీసుకోకూడదు. సోడా తాగాలంటే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే తీసుకోండి ఇది లివర్ డ్యామేజ్ కి కారణం అవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి