Garlic Health Benefits: పచ్చి వెల్లుల్లి మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా ఈ వెల్లుల్లిని మనం వంటలో వినియోగిస్తాం. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది మెదడు పనితీరుకి సహాయపడి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది ఈ పచ్చి వెల్లుల్లితో మా పచ్చి వెల్లుల్లి పోషకాలకు పవర్ హౌస్ ఇందులో మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్ ,మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
గుండె ఆరోగ్యం..
పచ్చి వెల్లుల్లిలో రక్తనాళాలు ఆర్టెరీ బ్లాక్ ఏర్పడకుండా కాపాడుతాయి. ఇందులో సల్ఫర్ హైడ్రోజన్ గా మార్చి ఎర్ర రక్త కణాలు సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తాయి. దీంతో రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది.
ఎనర్జీ బూస్ట్..
కొన్ని నివేదికల ప్రకారం పచ్చివెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు శక్తి కూడా తక్షణమే పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ సీజనల్ వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
కొలెస్ట్రాల్..
పచ్చి వెల్లుల్లి అల్లిసిన్ ఉంటుంది. ఇది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లి తరచు మన డైట్ లో చేర్చుకోవాలి.
ఇదీ చదవండి: ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల 8 జబ్బులు నయమైపోతాయి..
మెడిసినల్..
ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చిగా తిన్నా ఉడికించి తిన్న కానీ ఇందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం మన శరీరానికి అందుతాయి.
బరువు తగ్గుతారు..
పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల పోషకాలు మెటబాలిజం రేటును పెంచుతాయి. దీంతో బరువు తగ్గుతారు. ఎందుకంటే వెల్లుల్లి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు కలుగుతుంది. దీంతో అతిగా తినడం ఆపేస్తారు. బరువు పెరగకుండా ఉంటారు.
ఇదీ చదవండి: ఈ 7 మార్నింగ్ ఆహారాలతో యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలు కూడా మాయం..
ఇమ్యూనిటీ..
పచ్చి వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవడం వల్ల సీజనల్ వ్యాధులను జబ్బుల నుంచి దూరంగా ఉంటారు. వైరస్ల నుంచి పోరాడే శక్తి మీకు కలుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడరు. ముఖ్యంగా సాధారణంగా వచ్చే జబ్బు జలుబు ఫ్లూ వ్యాధులకు వ్యతిరేకంగా అల్లిసిన్ యాంటీబయటిక్ లాగా పని చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి