High Cholesterol Signs: కోలెస్ట్రాల్ అనేది మన సెల్ మెంబ్రేన్‌లు, హార్మోన్లు, విటమిన్ D తయారీకి  చాలా అవసరం అయిన ఒక మైనపు పదార్థం. ఈ కొలెస్ట్రాల్ అనేది రక్తం ద్వారా ప్రయాణించడానికి లిపోప్రోటీన్లు అవసరం. ముఖ్యంగా రెండు రకాల లిపోప్రోటీన్లు ఉంటాయి: ఒకటి LDL కొలెస్ట్రాల్ మరొకటి HDL కొలెస్ట్రాల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LDL కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు నిక్షేపాలు రక్తనాళాల్లో నిల్వ ఉండిపోతాయి. దానివల్ల రక్తప్రవాహం తగ్గి గుండె, మెదడు సంబంధించిన సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అది స్ట్రోక్ కి కూడా కారణం అవుతుంది.


HDL కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్  అని అంటారు. అది LDL కొలెస్ట్రాల్‌ను లివర్ కి తీసుకెళ్ళి శరీరం నుంచి తొలగిస్తుంది. HDL కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు, రక్తం గడ్డలు కట్టడం, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


హై కొలెస్ట్రాల్ లక్షణాలు:


హై కొలెస్ట్రాల్ సాధారణంగా ఎలాంటి కీలక లక్షణాలను బయటకు చూపించదు. కేవలం రక్తపరీక్ష ద్వారా మాత్రమే LDL కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోవచ్చు. కానీ LDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవేంటో చూద్దాం:


- నొప్పి
- చేతులు, కాళ్లలో స్పర్శ తెలియకపోవడం
- మాట్లాడడంలో ఇబ్బంది రావడం లేదా నాలుక ఎక్కువగా తడబడడం
- చిన్న పని చేసినా చాలా అలసటగా అనిపించడం
- ఛాతిలో నొప్పి 
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- చేతులు, కాళ్లు చల్లగా అయిపోవడం
- హై బ్లడ్ ప్రెషర్


మీరెప్పుడైనా ఈ లక్షణాలు గమనించినప్పుడు తక్షణమే దగ్గరలో ఉన్న అత్యవసర చికిత్స కేంద్రానికి వెళ్లి రక్తపరీక్ష, ఇతర పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 


హై కొలెస్ట్రాల్ కి కారణాలు:


అసలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం. ప్రతి రోజూ బయట జంక్ ఫుడ్ మాత్రమే తింటూ, సరైన వ్యాయామం కూడా చేయకపోతే బరువు పెరుగుతారు. దాని వల్ల కొలెస్ట్రాల్ పేరుకుపోయి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


కుటుంబంలో ఎవరికైనా హై కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నా కూడా మనకి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా డయాబెటిస్, బ్లడ్ ప్రజర్ లాగా వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. అయితే సిగరెట్లు, మద్యం అలవాటు ఉన్న వాళ్ళలో కూడా  కొలెస్ట్రాల్ కనిపిస్తుంది. 


కోలెస్ట్రాల్ తగ్గించడానికి చేయాల్సిన పనులు:


మద్యం, పొగాకు లాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, అసలు తీసుకోకూడదు. ఆహారం విషయంలో కంట్రోల్ లేకపోతే దానికి సరైన వ్యాయామం అయినా చేయాలి. బరువు విపరీతంగా పెరిగిపోకుండా నియంత్రించుకోవాలి.


ఒంట్లో కొలెస్ట్రాల్ ఏదైనా ఎక్కువగా ఉంది అన్న అనుమానం వచ్చినా లేదా పైన చెప్పిన లక్షణాలను గమనించినా తప్పకుండా డాక్టర్ ని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలి.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter