Lotus Roots For Weight Loss In 10 Days: ఆధునిక జీవన శైలి కారణంగా ప్రతి వంద మందిలో 30 మంది బరువు పెరగడం లేదా మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది 50 సంవత్సరాల లోపు వారే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలిలో పాటించే ఆహార పద్ధతులేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఈ రెండు సమస్యల బారిన పడడమే, కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన గుండెపోటు, అధిక రక్తపోటు, క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆహారాలు తీసుకునే పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేయడమే, కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఔషధ గుణాలు కలిగిన ఆహారాలు  కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా బరువు పెరగడం అధిక రక్తపోటు మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో కమలం పువ్వు వేర్లను తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు ఈ లోటస్ రూట్‌లో శరీరానికి కావాల్సిన ఫైబర్, ఐరన్, పొటాషియం, ప్రోటీన్స్, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు డయాబెటిస్తో బాధపడుతున్న వారు బరువు తగ్గాలనుకునేవారు దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రూట్స్‌ను పచ్చడి లాగా కూడా తయారు చేసుకుని తినొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఇలా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని వారంటున్నారు.


తామర చెట్టు వేర్లతో కలిగి లాభాలు:
వాపులను తగ్గిస్తుంది:

తామర చెట్టు వేర్లలో యాంటీ ఇన్ఫర్మేషన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తరచుగా వాపుల సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది:
తామర వేర్లలో ఫైబర్ తో పాటు అధిక పరిమాణంలో పోషక గుణాలు ఉంటాయి. కాబట్టి సమంత తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పీచు పదార్థాలు లభిస్తాయి. దీనికి కారణంగా మలబద్ధకం పొట్ట సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది:
ప్రస్తుతం స్థూలకాయం అనేది సాధారణ సమస్యగా మారింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే సులభంగా శరీర బరువును తగ్గించుకోవాలనుకునేవారు, తప్పకుండా తామర చెట్టు వేర్లను మీరు తీసుకునే డైట్లో వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రించేందుకు ఈ వేర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి