Low Back Pain Tips: నడుము నొప్పి వేధిస్తుందా, ఈ చిట్కాలతో Back Pain మటుమాయం!
Low Back Pain Remedies: నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవాలి.
Low Back Pain: ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి (Back Pain) ఒకటి. గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా నడుము నొప్పి బారిన పడే వారి సంఖ్య అధికం అవుతుంది. నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు.
నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల క్రీడలు ఆడేవారు ఈ పద్ధతిని వాడుతారు. ఈ క్రమంలో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను గురించి పట్టించుకోవడం లేదు. అయితే మెడిసిన్ వాడాల్సిన పని లేకుండానే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన ఆరోగ్య చిట్కాల (Health Tips)ను పాటిస్తే చాలు. నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.
Also Read: Mint Benefits: పుదీనా తింటున్నారా, ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
- మీకు పాలు తాగే అలవాటు ఉందా. లేదా తేనే తీసుకునే అలవాటు ఉందా. ఒకవేళ మీకు అలవాటు లేకపోయినా, నడుము నొప్పి తగ్గడానికి గ్లాసు పాలలో ఓ రెండు, మూడు చెంచాల తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
- నొప్పి అధికంగా ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచి తీసేస్తే ప్రయోజనం ఉంటుంది. చిన్న అల్లం ముక్కలను నీళ్ల(Drinking Water)లో వేసి వేడిచేయాలి. వడగట్టి చల్లార్చాలి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందని చెబుతారు.
Also Read: Coffee Benefits: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా, కోవిడ్-19 గురించి ఇది తెలుసుకోండి
- వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవాలి. సుదీర్ఘంగా కూర్చోవడం ద్వారా నడుము నొప్పితో పాటు ఊబకాయం(Obesity) లాంటి సమస్యల బారిన పడతారు.
- గసగసాల పొడితో నడుము నొప్పికి పరిష్కారం. ఓ గ్లాసు పాలలో కొంచెం గసగసాల పొడి ప్రతిరోజూ ఒకసారి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
గమనిక: నడుము నొప్పి వచ్చిందని పెయిన్ కిల్లర్స్ వాడకం మొదలుపెట్టడానికి ముందు డాక్టర్లను సంప్రదించాలి. మీకు మీరే సొంతంగా మెడిసిన్ తీసుకోకూడదు. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook