Makhana Kheer For Diabetes And Weight Loss: మానవ శరీరం రెండు రకాల కొలెస్ట్రాలను కలిగి ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే మరొకటి చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడి తీవ్ర గుండె సమస్యలు, మధుమేహం వంటి చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలితో పాటు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా మఖానాను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గొచ్చు:

శరీర బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలామంది కష్టపడి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇకనుంచి కష్టతరమైన వ్యాయామాలు చేయనక్కర్లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా మఖానాను తీసుకుంటే శరీర బరువు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి.


Also read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది


రక్తపోటును నియంత్రణలో ఉంటుంది:
మఖానాలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి పాలతో ప్రతిరోజు వీటిని తినడం వల్ల రక్తపోటు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషక విలువలు రక్తపోటు కారణంగా వచ్చే ప్రాణాంతక వ్యాధులు కూడా రాకుండా శరీరాన్ని సంరక్షిస్తాయి. 


మఖానా ఖీర్:
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మఖానా తో తయారు చేసిన ఖీర్ ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు చక్కెర వినియోగించకుండా తయారు చేసిన మఖానా ఖీర్ తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రణలో ఉంటాయి.



నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.


Also read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook