Malaria Vaccine: మలేరియా ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ప్రతియేటా లక్షలాదిమంది మలేరియా బారినపడి మరణిస్తున్నారు. ఇప్పుడు మలేరియా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులో రానుంది. క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలుండటంతో..ఆసక్తి రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచమంతా ఇప్పటికీ వణికిస్తున్న మలేరియా విషయంలో గుడ్‌న్యూస్ లభిస్తోంది. అమెరికాలో తొలిసారిగా మలేరియా వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియాపై అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు వెలుగుచూస్తున్నాయి. ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ప్రకారం..మలేరియాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేయనుందని తెలుస్తోంది.  L9LSగా పిల్చుకునే మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజక్షన్..మలేరియా పరాన్నజీవి సంపర్కంలో..సురక్షితంగా భావిస్తున్నారు. మలేరియాకు వ్యతిరేకంగా ఈ ఇంజక్షన్ ఆశించిన ఫలితాలనిచ్చిందని తెలుస్తోంది. 


L9LS వ్యాక్సిన్ చిన్నారులకు సైతం సీజనల్, అన్ సీజనల్ మలేరియా నుంచి 6-12 నెలల వరకూ రక్షణ ఇవ్వగలదా..లేదా అనేది పరిశోధించేందుకు మాలీ, కెన్యాల్లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాల్లో మలేరియా ఉచ్ఛస్థితికి చేరుకుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం..ప్రాదమిక క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశలు రేపుతున్నాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ అనేది మలేరియా నుంచి మనిషిని కాపాడటంలో కీలకపాత్ర పోషించనుంది. ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 6-12 నెలల వరకూ మలేరియా నుంచి రక్షించుకోవచ్చు. ప్రత్యేకించి మలేరియా పీడిత దేశాల్లో చిన్నారుల మరణాల్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. 


మలేరియా అనేది దోమకాటుతో వ్యాపించే వ్యాది. ఇది ప్లాస్మోడియం పరాన్నజీవి కారణంగా వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2020లో 24 కోట్లమంది మలేరియా బారినపడ్డారు. ఇందులో 6-7 లక్షలమంది మలేరియా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా దేశాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు చిన్నారుల మరణాల్లో 80 శాతం కారణం మలేరియాగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మలేరియా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌పై నిరంతరం పరిశోధనలు చేస్తూ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Also read: Aloevera Gel: ఇంట్లోనే అల్లోవెరా జెల్ తయారు చేసుకునే సులభమైన పద్దతి ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook