Aloevera Gel: ప్రకృతిలో లభించే ఔషధాల్లో అల్లోవెరా ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు సైతం అధ్భుతమైన పరిష్కారం. అల్లోవెరాను ఇంట్లోనే సహజసిద్దంగా తయారు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. ఆ విధానం మీ కోసం..
అల్లోవెరా. అద్భుతమైన ఔషద గుణాల మొక్క. ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోగలిగే అనువైన మొక్క ఇది. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు..చర్మ సంరక్షణకు కూడా చాలా మంచిది. అల్లోవెరా మొక్క ఆకుల్లో నీటీని జెల్ రూపంలో భద్రపరుస్తుంది. ఈ జెల్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. దాంతోపాటు స్కార్స్, సన్‌బర్న్, మచ్చలు, పిగ్మంటేషన్, డ్రై స్కిన్ సమస్యలకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అందుకే చాలా కంపెనీలు కొద్దిగా ప్రిజర్వేటివ్స్ చేర్చి లక్షలాదిరూపాయలు సంపాదిస్తుంటారు. అయితే అల్లోవెరాను ఇంట్లోనే సహజసిద్దంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మరింత మంచిది. ఇంట్లో అల్లోవెరా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
అల్లోవెరా జెల్ తయారీ ఎలా
అల్లోవెరా తయారీ కోసం అల్లోవెరా ఆకులు, బ్లైండర్, ఎయిర్‌టైట్ బాక్స్, విటమిన్ సి లేదా విటమిన్ ఇ పౌడర్. ఓ వారం రోజుల కోసం మాత్రమే తయారు చేసుకోవాలి. ముందుగా అల్లోవెరా ఆకుని 3-4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఆ ముక్కల్ని ఏదైనా పళ్లెంలో నిలబెట్టి కొద్దిసేపుంచాలి. దీనివల్ల ఇందులో పేరుకుని ఉండే పసుపు రంగు జిగురు బయటికొచ్చేస్తుంది. ఎందుకంటే ఈ జిగురు మంచిది కాదు. తరువాత అల్లోవెరా శుభ్రం చేసుకుని పైభాగంలో ఉండే ఆకుపచ్చని తొక్కను తొలగించాలి.
మరోసారి శుభ్రం చేసుకోవాలి.
ఇప్పుడు తొక్క ఒలిచిన అల్లోవెరా నుంచి జెల్‌ను స్పూన్ సహాయంతో తీసి బ్లైండర్‌లో వేయాలి. లిక్విడ్‌గా మారేవరకూ బ్లైండ్ చేయాలి. ఇలా చేసిన అల్లోవెరా వారం రోజులవరకూ ఉపయోగపడుతుంది. ఇందులో కొద్దిగా విటమిన్ సి, విటమిన్ ఇ పౌడర్ కూడా కలపవచ్చు. ఎందుకంటే ఈ రెండింట్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజియింగ్ గుణాలు అధికం. అల్లోవెరా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.
Also read; Diabeitc Diet Tips: డయాబెటిక్ రోగులు ఈ కూరగాయలు అస్సలు తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook