Hidden Health Benefits of Yoga: శారీరక, మానసికంగా ఆరోగ్యం ఎదగాలంటే యోగాకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. భారతదేశంలో ఎన్నో వేళ ఏళ్ల నుంచి యోగాను అభ్యసించేవారు ఉన్నారు. అందుకే ఇది భారత దేశంలోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా యోగా గుర్తింపు పొందింది. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే అంతటి ప్రాచుర్యం పొందిన యోగాను రోజూ వ్యాయామంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైన 8 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


యోగా వల్ల కలిగే ప్రయోజనాలు..



1. భౌతికంగా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు యోగాలో అనేక రకాలు అభ్యాసాలు, ఆసనాలు ఉన్నాయి. వీటితో పాటు శ్వాసకోస వ్యాధులు దూరమవ్వడానికి ప్రాణాయామాలు, బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. యోగా, ధ్యానం వల్ల శ్వాస మీద ధ్యాస వంటి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా మారొచ్చాని యోగా శాస్త్రాలు చెబుతున్నాయి. 


2. యోగా వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగు అవుతుంది. దీని వల్ల ఎదుటి వారిపై మనలో పెరిగే అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని నివారించుకోవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతోంది. 


3. ప్రతిరోజూ చేసే పనులు కొందరిలో ఆసక్తి తగ్గుదల కనిపిస్తుంది. అలాంటి వారు రోజూ యోగా చేయడం వల్ల వారిలో పనిపై శ్రద్ధ, ఆసక్తి, ఏకాగ్రత పెరిగిపోతాయి. 


4. యోగా ప్రక్రియ మన శరీరంలోని పారా సింపథెటిక్‌ నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఒత్తిడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పనిపై ఆందోళన తగ్గించి నియంత్రణగా పని చేయగలుగుతాం. యోగా వల్ల రిలాక్సింగ్ మోడ్‌లోకి ఈజీగా వెళ్లొచ్చు. 


5. యోగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలోని కండరాలను దృఢంగా మారుస్తుంది. దీంతో శారీరకంగా బలోపేతం అవ్వొచ్చు. నీరసం మీ దరిచేరదు. 


6. యోగా ప్రక్రియ వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా ఉన్న వ్యర్థాలు శరీరం నుంచి బయటకు నెట్టివేయబడతాయి. దీనివల్ల మన శరీరం నిర్మలంగా ఉంటుంది. 


7. యోగాలో ధ్యానమూ ఒక భాగంగా ఉంది. ప్రాణాయామంతో మన ప్రాణ శక్తిని ధ్యానం అనుసంధానం చేస్తుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రాణాయామం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి నివారణ లభిస్తుంది. 


8. యోగ అభ్యాసాన్ని క్రమంగా చేస్తూ మనలోని ఆధ్యాత్మికంగా ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అయితే యోగా నేర్చుకునేందుకు సాధారణంగా టీచర్లను కాకుండా యోగా నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి