కరోనా వైరస్ సోకినవారు వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. దాంతో సమస్య క్లిష్టతరం కాకుండా వైరస్ మహమ్మారిపై పోరాటం ప్రారంభం అవుతుంది. కొందరు వారం రోజులకే కోవిడ్19 నుంచి కోలుకుంటే, మరికొందరికి రెండు వారాలు, ఇంకొందరు నెలకు పైగా రోజులు చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు సైతం భౌతికదూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నుంచి కోలుకున్న తరువాత సైతం రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. కొందరు కోవిడ్19ను జయించినా దాని ప్రభావం కొంతకాలంపాటు ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండె, ఛాతి సంబంధిత అవయవాల పనితీరుతో పాటు ఇంకా ఏమైనా అనారోగ్య సమస్య ఉంటే తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ (CoronaVirus) స్వల్ప లక్షణాలున్న సమయంలోనే చికిత్స చేయించుకుని కోలుకుంటే ఓకే. కానీ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన తరువాత చికిత్స చేయించుకుని, కరోనా నుంచి కోలుకున్న వారు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 


Also Read: Covid-19ను జయించిన స్టైలిష్ స్టార్ Allu Arjun, జాగ్రత్త అంటూ బన్నీ ట్వీట్


విటమిన్-డి టెస్ట్
కరోనా సోకిన వారిలో విటమిన్ డి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కనుక కరోనా జయించిన తరువాత వీరికి విటమిన్ డి టెస్ట్ చేయించి, ఏమైనా లోపం ఉంటే అందుకు తగ్గట్లుగా మెడిసిన్ తీసుకోవాలి. రోగనిరోధక శక్తికి విటమిన్ డి(Vitamin D) కీలకమని తెలిసిందే. 


సీబీసీ టెస్ట్
శరీరంలో తెల్లరక్తకణాలు, ఎర్రరక్త కణాలు మొత్తాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్ష కంప్లీట్ బ్లడ్ కౌంట్ (Complete Blood Count). రక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్స్ సంఖ్యను సీబీసీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేకపోతే కోవిడ్19ను జయించిన అనంతరం మీరు వేగంగా కోలుకుని నార్మల్ అవుతారు. 


గ్లూకోజ్, కోలెస్ట్రాల్ టెస్ట్
రక్తం గడ్డకట్టడం, రక్తంలో గ్లూకోజ్ మరియు రక్తప్రవాం లాంటి విషయాలను తెలుసుకునేందుకు గ్లూకోజ్, కోలెస్ట్రాట్ టెస్ట్ నిర్వహిస్తారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఈ పరీక్షలు చేయించి, ఏదైనా సమస్య ఉంటే మెడిసిన్ తీసుకుంటే మరింత త్వరగా అన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి బయటపడతారు. కొవ్వు సమస్య ద్వారా కరోనా(CoronaVirus) నుంచి కోలుకున్నప్పటికీ , పూర్తిగా రికవరీ అయ్యేలోగా గుండెపోటు, ఛాతీలో నొప్పి లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి.


Also Read: Covid-19 Variant: ప్రాణాంతక కరోనా వేరియంట్ 44 దేశాలకు వ్యాపించింది


ఛాతి పరీక్షలు
కరోనా వైరస్ సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్ సోకే అవయవం ఊపిరితిత్తులు. కునక ఏ మేర ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు చెస్ట్ స్కాన్ చేయించుకోవాలి. పూర్తి స్థాయిలో ఛాతీని పరీక్షించుకునేందుకు హెచ్‌ఆర్‌టీసీ స్కాన్ చేయించుకుని, ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి కోలుకునేందుకు చికిత్స చేయించుకోవాలి. 


గుండె సంబంధిత పరీక్షలు
కరోనాను జయించిన వారిలో వైరస్‌పై పోరాడుతున్న సమయంలో కలిగే అనారోగ్యం, అసౌకర్యం కారణంగా గుండె నొప్పి, ఛాతీలో మంట లాంటివి వస్తాయి. కనుక కోవిడ్19ను జయించిన తరువాత నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. Heart Imaging మరియు Heart Function పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


IgG యాంటీబాడి టెస్ట్
కరోనాను జయించిన వారిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. కోవిడ్19 నుంచి కోలుకున్నాక IgG Antibody Test చేయించుకుంటే యాంటీ బాడీలు ఏ మేర ఉత్పత్తి అయ్యాయో తెలుస్తుంది. తద్వారా మీకు ప్లాస్మా దానం చేయవచ్చా లేదా అనే దానిపై అవగాహన వస్తుంది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం నెల రోజుల్లోగా యాంటీబాడి టెస్టు చేపించుకోవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook