Health news: మన ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఒక కాలు మీద నిలబడగలిగే సామర్థ్యం అనేది మన హెల్త్ కు సంబంధించి లోతైన విషయాలను తెలియజేస్తుందని అధ్యయనం వెల్లడించింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కనీసం 10 సెకన్ల పాటు ఒక కాలు మీద నిలబడలేని మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్లు ఒక దశాబ్దంలో చనిపోయే అవకాశం 84% ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. దీనికి ‘'ఫ్లెమింగో టెస్ట్'’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 2009 నుండి బ్రెజిల్‌లో 50 ఏళ్లు పైబడిన 1,702 మంది వ్యక్తులపై అధ్యయనం చేసిన బ్రెజిల్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, UK మరియు US లకు చెందిన పరిశోధన బృందం ఈ వివరాలు వెల్లడించారు.  పరిశోధనలో భాగంగా.. ఇందులో వాలంటీర్లగా పాల్గొన్న వ్యక్తులను 10 సెకన్లపాటు ఒంటికాలు మీద నిలబడాలని కోరారు. ఇలా రెండు పాదాలతో 3 సార్లు ప్రయత్నించాలని పరిశోధనకులు వారికి చెప్పారు. దాదాపు 21శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. రియోడిజనీరోలోని క్లినిమెక్స్ ఎక్సర్ సైజ్ మెడిసిన్ క్లినిక్ కి చెందిన డాక్టర్ క్లాడియో గిల్ అరౌజో ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల్లో ఈ బ్యాలెన్స్ టెస్ట్ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 


Also Read: Reduce Sweating Tips: చెమట ఎక్కువగా పడుతుందా.. అయితే ఇవి తినండి..! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.