Migraine Home Remedies in Winter: శీతాకాలం ప్రారంభమైందంటే చాలు..చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు ముఖ్యంగా పిల్లలనుంచి పెద్దవారి దాకా ఇన్ఫెక్షన్ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే కొంతమందిలో ఈ సమస్యలతో పాటు తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా. మొదటగా తలనొప్పితో ప్రారంభమై మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మైగ్రేన్ సమస్య శీతాకాలంలో అంతగా ప్రభావం చూపలేకపోయినా భవిష్యత్తులో ఈ సమస్య తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా మైగ్రేషన్ సమస్య వాతావరణం లోని మార్పుల కారణంగా మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు హెచ్ యు తగ్గులు తేమ పెరగడం కారణంగా తలనొప్పికి గురవుతారు. అయితే ఈ తలనొప్పి కొంతమందిలో సాధారణంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.


చలికాలంలో మైగ్రేన్ ఎందుకు వస్తుంది?
బారోమెట్రిక్ ప్రెజర్‌లో మార్పు కారణంగా శీతాకాలంలో మైగ్రేన్ వస్తుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబితే.. మరి కొంతమంది వాతావరణంలోని మార్పులు కారణంగా మెదడులోని నాళాల్లో సంకోచం ఏర్పడి ఈ సమస్య వస్తుందట. కాబట్టి ఇప్పటికీ మైగ్రేషన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చల్లని గాలులు వీచే సమయంలో బయటికి వెళ్లడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ చలికాలంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలనే మాత్రమే తీసుకోవాలి. దీంతోపాటు ఎప్పటికప్పుడు శరీరాన్ని కూడా హైడ్రేట్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


చలికాలంలో మైగ్రేన్ నివారణలు:
ఒత్తిడిని నివారించండి:

ప్రస్తుతం చాలామంది ఆఫీసుల్లో వర్క్ ప్రెజర్ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగా మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పకుండా వ్యాయామాలతో పాటు యోగ చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.


సరైన నిద్ర:
ఆరోగ్యకరమైన శరీరానికి నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మైగ్రేన్ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చాలామందిలో మైగ్రేన్ సమస్యలు రావడానికి ప్రధాన కారణం నిద్రలేకపోవడమేనని వారంటున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook