Millet Benefits: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ధాన్యాలలో జొన్నలు (Millet) ఒకటి. వీటితో పాటు అనేక రకాలు చిరు ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి. వైట్ రైస్ స్థానంలో ఈ మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా నియంత్రిచవచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిల్లెట్స్ శరీరానికి ఆరోగ్యకరమైనవి. గోయిట్రోజెనిక్ పాలీఫెనాల్స్, ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియెంట్లకు కూడా ఇవి బలమైన మూలం. వీటి వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాల వృద్ధి చెందుతుంది. అయితే మిల్లెట్స్ వల్ల కలిగి ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


మిల్లెట్స్ వల్ల ప్రయోజనాలు..


షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం


రక్తంలో చక్కెర స్థాయిలను సరైన పద్ధతిలో నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనంలో రైస్ కు బదులుగా ఈ ధాన్యాన్ని ఎంచుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధితో బాధపడే వారు దీన్ని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవచ్చు. 


ఎముకలు ఆరోగ్యంగా..


ఆరోగ్యకరమైన ఎముకలు శరీరానికి నిర్మాణానికి తోడ్పడతాయి. మిల్లెట్స్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మొదలైనవి శరీరానికి మేలు చేస్తాయి. ఎముకల ఎదుగుదలతో పాటు ధృఢంగా మారేందుకు సహాయం చేస్తుంది. 


బరువు నియంత్రణ


మిల్లెట్స్.. ఫైబర్, ప్రోటీన్, ఇతర పోషకాలకు మూలం. ఇవి జీవక్రియను పెంచడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. ఇది మిల్లెట్లను బరువు తగ్గడానికి సహకరిస్తుంది. వైట్ రైస్ కు మిల్లెట్స్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. 


కొలస్ట్రాల్ ను క్రమబద్ధీకరిస్తుంది


మిల్లెట్‌లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మిల్లెట్ యొక్క ప్రయోజనాలను కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. ఈ చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిడం సహా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.  


Also Read: Sprouts on Empty Stomach: ఖాళీ కడుపుతో ఇవి తింటే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది!


Also Read: Corriandor Seeds: ధనియాల నీటితో ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.