Millet Roti For Weight Loss: మిల్లెట్స్ రోటీతో బరువుతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం ఎలా?
Millet Roti For Weight Loss And Bad Cholesterol Control: మిల్లెట్ రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Millet Roti For Weight Loss And Bad Cholesterol Control: మిల్లెట్స్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో ఫైబర్‌తో పాటు అమైనో ఆమ్లాల అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఈ రోటీలను తినడం వల్ల శరీరానికి కలిగే ఇతర ప్రయోజాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిల్లెట్ రోటీల శరీరానికి కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
మిల్లెట్స్‌తో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల వీటిలో లభించే పొటాషియం, మెగ్నీషియం శరీరానికి లాభిస్తాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా BP, కొలెస్ట్రాల్, గుండెపోటు వంటి తీవ్ర వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
మధుమేహంలో ఉన్న వారిలో బ్లడ్‌లోని షుగర్ లెవెల్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అయితే దీని కారణంగా మధుమేహం తీవ్ర తరమయ్యే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు ఆహారంలో గోధుమలకు బదులుగా మిల్లెట్ రోటీలను తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
బరువును నియత్రిస్తుంది:
మిల్లెట్‌లో పీచు పదర్ధాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు మిల్లెట్స్‌తో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల పొట్టు కూడా నిండుగా ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెపుతున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
రక్తపోటు సమస్య నుంచి విముక్తి:
మిల్లెట్‌లో ఐరన్ లెవల్స్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆల్పాహారంలో మిల్లెట్ రోటీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలోని రక్తం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter