Jaggery Combination Food Items: బెల్లంతో ఈ పదార్థాలను కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్!
Jaggery Combination Foods Benefits: బెల్లం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కొన్ని పదార్థాలతో బెల్లం కలుపుకొన్ని తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. బెల్లంను లాంటి పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల లాభాలు పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Jaggery Combination Foods Benefits: బెల్లం తీసుకోవడం వల్ల అనేక పోషకాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బెల్లంలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా బెల్లంలో ఐరన్, కాల్షియం, పొటాషియం లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, జీర్ణవ్యవస్థతో బాధపడుతున్నవారు ఈ బెల్లం తినడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచడంలో బెల్లం ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ బెల్లంని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంలో ఈ పదార్థాలు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
పసుపు-బెల్లం:
బెల్లంతో పసుపు కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పసుపులో కర్కుమిన్ లభిస్తుంది. ఇందులో రోగనిరోధక లక్షణాలు ఉంటాయి. దనిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా పేగు కదలికలు ఎక్కువ అవుతాయి. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పసుపు, బెల్లం తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శొంఠి-బెల్లం:
శొంఠిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. దీనిని బెల్లంతో కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలు ఈ శొంఠి వల్ల తీసుకోవడం వల్ల తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బెల్లం, శొంఠి తీసుకోవడం వల్ల తీవ్రమైన జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శొంఠి పొడిని నీళ్లలో కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సోంపు-బెల్లం:
తీవ్రమైన శరీర వాపులతో బాధపడుతున్నవారు సోంపు, బెల్లం తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడుతారు. సోంపులో కాల్షియం , మెగ్నీషిం, పొటాషియం, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు లభిస్తాయి. దీనిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. అంతేకాకుండా సోంపులో ఉండే మినరల్స్ హోర్మోన్స్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది. ప్రతిరోజు సోంపు, బెల్లం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Walking Tips: వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది, ఉదయమా.. సాయంత్రమా
నువ్వులు-బెల్లం:
నువ్వులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పొటాషియం, ఐరన్ బెల్లంలో లభిస్తాయి. అదేవిధంగా నువ్వులు కూడా వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. నువ్వులు , బెల్లం కలిపి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సీజన్‌లో వచ్చే సమస్యల నుంచి రక్షిస్తుంది. పిల్లలకు ఈ రెండు పదార్థాలు భోజంలో భాగంగా ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ధనియా-బెల్లం:
ధనియాలు, బెల్లం కలిపి తినడం వల్ల మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా బెల్లంని ఈ పదార్థాలతో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ప్రతిరోజు ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా , ఆరోగ్యంగా ఉంటుంది.
Also read: Almonds Uses: బాదం పప్పు తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook