Adrenal Fatigue: అడ్రినల్ ఫ్యాటిగ్ అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి
Adrenal Fatigue: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందులో ఒకటి అడ్రినల్ ఫ్యాటిగ్. పేరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు గానీ లక్షణాలు తరచూ చవి చూసే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Adrenal Fatigue: ఇటీవలి కాలంలో అడ్రినల్ ఫ్యాటిగ్ అనేది ప్రమాదకరమైన వ్యాధిగా పరిణమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ వ్యాధి మనిషిని అంతకంతకూ బలహీనపరుస్తూ జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తుంది. అసలు అడ్రినల్ ఫ్యాటిగ్ అంటే ఏమిటి, ఎలా ఉపశమనం పొందాలో వివరాలు పరిశీలిద్దాం.
అడ్రినల్ ఫ్యాటిగ్ వ్యాధి వల్ల రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంటుంది. శరీరంలో అడ్రినల్ గ్లాండ్స్ సరైన రీతిలో పనిచేయకుంటే అడ్రినల్ ఫ్యాటిగ్ రూపం తీసుకుంటుంది. ఎమోషనల్, ఫిజకల్ స్ట్రెస్‌కు గురైనప్పుడు అడ్రినల్ ఫ్యాటిగ్ లక్షణాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విపరీతమైన అలసట, ఎంత నిద్రపోయినా వదలని నీరసం, బలహీనంగా ఉండటం, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు ప్రధానంగా కన్పిస్తాయి. స్వీట్ మరియు సాల్టీ పదార్ధాలు తినాలనే కోరిక కలుగుతుంటుంది. సాయంత్రం వేళల్లో ఎనర్జెటిక్‌గా ఉంటారు. రాత్రంతా నిద్రించినా సరే నీరసం, శక్తి లేకపోవడం, అలసట దూరం కాకపోవడం ఉంటుంది. మహిళల్లో ప్రీ మెన్స్టువల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమయంలో లో బీపీ ఉంటాయి.
అడ్రినల్ ఫ్యాటిగ్ ఎలా దూరం చేయాలి
ప్యాంటోథెనిక్ యాసిడ్ లేదా విటమిన్ బి5 తీసుకోవడం ద్వారా అడ్రినల్ ఫ్యాటిగ్ లక్షణాలు దూరం చేయవచ్చు. విటమిన్ బి5 అనేది ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసోల్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తుంది. అస్ట్రాగ్యాలస్ వినియోగంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వెల్లింగ్ తగ్గుతుంది.
విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్ తీసుకోవడం ద్వారా నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, బత్తాయి, నిమ్మ వంటివి తీసుకోవడం ద్వారా అడ్రినల్ ఫ్యాటిగ్ సమస్య తగ్గించవచ్చు. కార్డిసెప్స్ అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఇమ్యూన్, ఇన్‌ఫ్లమేటరీని తగ్గిస్తుంది. ఇక మరో ముఖ్యమైంది విటమిన్ ఇ. దీని వల్ల శరీరంలో ముఖ్యంగా అడ్రినల్ గ్రంథిలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయవచ్చు.
Also read: Aloevera Benefits: రోజూ అల్లోవెరా జ్యూస్ తాగితే మలబద్ధకం, ఎనీమియా, అజీర్తి మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook