What Is Myalgia: మలయాళ అగ్రనటుడు మోహన్‌ లాల్‌ యావత్‌ భారత సినీ ప్రపంచానికి తెలుసు. తన నటనతో ప్రేక్షకులను వినోదం అందిస్తున్న మోహన్‌ లాల్‌ ప్రస్తుతం అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆయనకు ఏమైంది? అస్వస్థతకు గురి కావడానికి కారణమేమిటని అభిమానులందరిలో మెదలుతున్న ప్రశ్న. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్‌ లాల్‌ ఆరోగ్యం కుదుటపడుతున్నా.. ఆయనకు ఏం జరిగిందనేది స్పష్టమైంది. ఈ మేరకు వైద్యులు ఆయనకు సోకిన వ్యాధి ఏమిటో తెలిసింది. దీంతో ఆ వ్యాధి గురించి నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Balakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదు


అనారోగ్యానికి గురయిన మోహన్‌ లాల్‌ కొచ్చిలోని ఏఐఎంఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. వైరల్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు అందులో తెలిపారు. అయితే ఆ బులెటిన్‌లో ఒక ప్రధానమైన విషయాన్ని పేర్కొన్నారు. మైయాల్జియా అని బులెటిన్‌లో వైద్యులు పొందుపర్చారు. ఆ వ్యాధి ఏమిటి? చాలా తీవ్రమైనదా? ప్రాణాంతకమా? అని అభిమానులతోపాటు కేరళ ప్రజలు ఆరా తీస్తున్నారు.

Also Read: Duvvada Srinivas Issue: వైఎస్‌ జగన్‌ సంచలనం.. దువ్వాడ శ్రీనివాస్ రాజీనామాకు ఆదేశం?


మైయాల్జియా అంటే?
వైద్యశాస్త్రంలో మైయాల్జియా అని పిలిచే ఈ వ్యాధి చాలా ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ వైద్య సంస్థలు చెబుతున్నాయి. కండరాలు, లిగ్మెంట్‌లలో నొప్పులు వస్తుంటాయి. జాన్స్‌ హప్కిన్స్‌ విశ్వవిద్యాలయం మైయాల్జియాపై సమగ్ర వివరాలు వెల్లడించింది. ఆ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. మైయాల్జియా రావడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపింది. గాయాలు, టెన్షన్‌కు గురవడం.. మందులు విపరీతంగా వాడడం, ఒత్తిడికి గురవడం, తరచూ అనారోగ్యానికి గురవడం వంటి కారణాలు మైయాల్జియా రావడానికి కారణమని యూనివర్సిటీ తన నివేదికలో తెలిపింది. మైయాల్జియాతో బాధపడుతుంటే శరీరమంత తీవ్రంగా ప్రభావమవుతుంది. మోహన్‌ లాల్‌ కూడా ఇదే విధమైన బాధపడుతున్నాడు. 


చాలా రోజులు విశ్రాంతి
వైద్యులు చెప్పిన ప్రకారం మోహన్‌ లాల్‌కు చాలా విశ్రాంతి అవసరం. మసాజ్‌, ఒత్తిడి తొలగించేందుకు కొన్నాళ్లు ఎక్కడకు వెళ్లకుండా ఉండాలి. మానసిక ఆందోళన ఉండకూడదు. మందుల కన్నా వ్యక్తిగత అలవాట్లతో మైయాల్జియా నివారించుకోవచ్చు. సరైన ఆహారం.. ఫిజియోథెరపి, వేడి చల్లటి నీళ్ల థెరపీ వంటి మైయాల్జియాను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మైయాల్జియా గురించి తెలుసుకున్న అనంతరం మోహన్‌ లాల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు, మూడు రోజుల పర్యవేక్షణ అనంతరం మోహన్‌ లాల్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే డిశ్చార్జ్‌ చేశాక దాదాపు 15 రోజులు తప్పకుండా విశ్రాంతి ఉండాలని వైద్యులు చెబుతున్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook