Monsoon Foods: వర్షాకాలంలో ఏయే కూరగాయల్ని తినకూడదు, కారణాలేంటి
Monsoon Foods: సీజన్‌ను బట్టి..ఆహార పదార్ధాలను ఎంచుకోవాలి. వేసవిలో, వర్షాకాలంలో, చలికాలంలో తినే పదార్ధాలను మార్చాల్సిన అవసరముంది. వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయల్ని తీసుకోవడం వల్ల కలిగే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..
Monsoon Foods: సీజన్‌ను బట్టి..ఆహార పదార్ధాలను ఎంచుకోవాలి. వేసవిలో, వర్షాకాలంలో, చలికాలంలో తినే పదార్ధాలను మార్చాల్సిన అవసరముంది. వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయల్ని తీసుకోవడం వల్ల కలిగే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..
వర్షాకాలం వస్తే చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్ చాలా త్వరగా సోకుతుంటుంది. బయట వాతావరణంలో కూడా వివిధ రకాల క్రిమి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే ఆహార పదార్ధాలను జాగ్రత్తగా పరిశీలించి తినాలి. ఎందుకంటే ఏ మాత్రం ఇన్‌ఫెక్షన్ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే వర్షాకాలం అంటేనే రోగాలు త్వరగా వ్యాపించే సమయంగా వైద్యులు చెబుతారు.
సాధారణంగా మెరుగైన ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయలు తినాలని చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం పచ్చి కూరగాయలు పొరపాటున కూడా తినకూడదు. వర్షాల కారణంగా ఏ కూరగాయలో అయినా..క్రిములు కచ్చితంగా చేరుతాయి. అలాంటి కూరగాయల్ని తింటే ఆరోగ్యానికి చాలా హాని చేకూరుతుంది. అందుకే పచ్చి కూరగాయల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా త్వరగా జీర్ణం కాని ఆహార పదార్ధాల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓక్రా, కాలిఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలు త్వరగా జీర్ణం కావు. ఫలితంగా ఉదర సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అందుకే వర్షాకాలంలో ఈ మూడు కూరగాయల్ని దూరంగా పెట్టడం మంచిది.
ఇక చాలామంది ఇష్టంగా తినే పుట్టగొడుగులను వర్షాకాలంలో మానేయడం మంచిది. ఎందుకంటే ఇందులో పుష్కలంగా పోషక పదార్ధాలున్నా..బ్యాక్టిరియాకు ఆవాసమిది. వర్షకాలంలో బ్యాక్టిరియా చాలా త్వరగా విస్తరిస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తతాయి. ఇక ఆకు కూరల్ని కూడా దూరంగా పెట్టాల్సిందే. ఆరోగ్యానికి మంచిదే అయినా..వర్షాకాలంలో బ్యాక్టీరియా, పురుగులు త్వరగా పడతాయి.
Also read: Tea Benefits: టీలో అవి కలుపుకుంటే..దగ్గు, జ్వరం, జలుబు దూరం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook