Monsoon Health Tips: దేశంలోపలు చోట్ల రుతుపవనాలు ప్రవేశించాయి. కురుస్తున్న వర్షాల కారణంగా  చాలా మంది వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు రావడం సహజమే.. కానీ వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటేరోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థ బాగా బలహీనపడి, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ పెడితే వర్షంలో రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని తప్పకుండా తినండి:


ఆపిల్:


రోజూ ఒక యాపిల్ తింటే అనేక వ్యాధులు నయమవుతాయి. ఆపిల్‌ పండ్లను క్రమం తప్పకుండా తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల శక్తి పుష్కలంగా లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.


జామున్:


వర్షాకాలంలో జామున్ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుందని అందరికీ తెలుసు. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలేట్, విటమిన్లు వంటి చాలా రకాల పోషకాలుంటాయి. కావున వీటిని తినడం వల్ల పొట్టలో సమస్యలు దూరమవుతాయి.


పొట్లకాయ:


వర్షాకాలంలో తినే ఆరోగ్యకరమైన కూరగాయలలో పొట్లకాయ ఒకటి. ఇందులో చాలా పోషక విలువలుంటాయి. కావున వీటిని తినడం ద్వారా చాలా రకాల పోషక విలువ శరీరానికి లభిస్తాయి.


రేగు పండ్లు:


రేగు పండ్లలో విటమిన్ సి, ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువ ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రిస్తుంది.


ఎరుపు కూరగాయలను తినండి:


క్యారెట్, బొప్పాయి, బిట్టర్ గోర్డ్ క్యాప్సికమ్, మోసంబి, మామిడి, దానిమ్మ, స్ట్రాబెర్రీ తింటే చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు!


Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపుఓ మోస్తరు వర్షాలు!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి