Health Benefits of Ginger: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీని వల్ల వాతావరణంలో తేమ పెరిగి చాలా మందిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, ప్లూ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటివలే నివేదిలు పేర్కొన్నాయి. ఈ సమస్యల నుంచి ఇంట్లో లభించే వివిధ రకాల వస్తువులతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వానా కాలంలో వచ్చే ఏ వ్యాధులకైనా అల్లం చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అయితే అల్లం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వానా కాలంలో వీటికి చెక్‌ పెడుతుంది:


మైగ్రేన్:


 తల నొప్పి (మైగ్రేన్) సమస్యలతో బాధపడుతూ ఉంటే అల్లం టీ ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని తాగడం వల్ శరీరంలో ప్రోస్టాగ్లాండిన్‌లు అనేవి తొలగించబడుతాయి. కావును నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


జలుబు, దగ్గు:


వానా కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో జలుబు, దగ్గు ముఖ్యమైనవి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి అల్లంతో చేసి డికాషన్‌ తాగండి. ఈ సమస్యల నుంచి త్వరలోనే ఉపశమనం పొందుతారు.  బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది.


ఆర్థరైటిస్:



అల్లంలో ఉండేగుణాలు కీళ్లనొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అల్లంలో ఉండే ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు ఈ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం పొందేట్లు చేస్తాయి.


మధుమేహం:


మధుమేహంతో బాధపడుతున్నవారు అల్లం చేసిన ఆహార పదార్థాలు తింటే శరీరంలోని  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇది ఇన్సులిన్ కార్యకలాపాలను కూడా పెంచుతుందని నిపుణులు పలు పరిశోధనల్లో తేలింది.


బరువు తగ్గడం:


మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణలు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అల్లంతో మరిగించిన నీటిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!


Also read:Presidential Election: క్రాస్ ఓటింగ్ వేయలేదు..బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారమన్న సీతక్క..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook