Monsoon Diseases: వర్షాకాలం వచ్చేసింది. దేశమంతా జోరుగా వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్యులు. ఆ వ్యాధుల్నించి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటివరకూ వడగాల్పులు, ఎండల వేడిమితో తల్లడిల్లిన ప్రజలు..వర్షాకాలం వస్తూనే ఉపశమనం పొందుతున్నా..సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంటోంది. సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు ఉన్నాయి. వర్షాకాలంలో టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫ్లూయెంజా నుంచి రక్షించుకోకపోతే..ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సీజనల్ వ్యాధుల్నించి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకుందాం..


వర్షాకాలంలో నీరు, భోజనం సహజంగా కలుషితమయ్యే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా అనారోగ్యం పాలవుతుంటారు. ముఖ్యంగా సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఇది జరుగుతుంది. ఇందులో జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యల్నించి కాపాడుకునేందుకు శుచి శుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 


వర్షాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా అనేది చాలా సహజం. ఈ వైరస్ గాలి ద్వారా వేగంగా సంక్రమిస్తుంది. శ్వాస, గొంతుపై ప్రభావం చూపిస్తుంది. వర్షకాలంలో తలనొప్పి, ఒంటి నొప్పులు, గొంతులో మంట, జలుబు వంటి సమస్యలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


మరో ప్రమాదకరమైన వ్యాధి కలరా. వర్షాకాలంలో కలరా వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. కలుషిత నీరు, కలుషిత భోజనం కారణంగా ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. తాగే నీరు పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 


డెంగ్యూ మలేరియాలు ఇంకా ప్రమాదకరమైనవి. వర్షాకాలంలో సహజంగానే చెరువులు, గుంతలు, టైర్లు, కిచెన్ ఇలా వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన నీళ్లలో డెంగ్యూ, మలేరియా కారక దోమలు వృద్ధి చెందుతాయి. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులు, తీవ్రమైన బలహీనత ఈ వ్యాధి లక్షణాలు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా..దోమల్నించి రక్షించుకోవాలి. 


Also read: Honey with Cold Milk: చల్లనిపాలలో కొద్దిగా తేనె కలుపుకుని తాగి చూడండి..అద్భుతం జరుగుతుంది



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook