Moringa Flowers : ప్రస్తుతం ఉన్న జాబ్ టెన్షన్స్, అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఇది నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బు, స్ట్రోక్స్ ,పక్షవాతం వంటి వాటికి దారి తీస్తుంది. కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్న బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. మరి ఇలాంటి వారి కోసం మునగ పువ్వులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునగ చెట్టుపై తెల్లగా మల్లె పువ్వుల్లా విరిసే ఈ మునగ పువ్వులలో ఎన్నో సహజ పౌష్టిక తత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఆయుర్వేదం ప్రకారం ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. మునగ పువ్వులలో అధిక మోతాదులో పొటాషియం, మెగ్నీషియం,కాల్షియంతో ఉంటాయి. ఇవి రక్తనాళాలలోని గోడలను సడలించి రక్తప్రసరణ సరిగా జరిగేలా చూసుకుంటాయి. తద్వారా హృదయనాళ వ్యవస్థపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించి బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్లో పెడతాయి.


వీటిలో సమృద్ధిగా లభించే క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా-కెరోటిన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫర్మేషన్ ను తగ్గిస్తాయి. శరీరంలో సోడియం లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో ఉంచడంలో కూడా మునగ పువ్వు సహాయపడుతుంది. అలాగే మన రక్తంలోని అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్గా మునగ పువ్వు తీసుకునే వారికి రక్త శుద్ధి కూడా జరుగుతుంది. అయితే మునగ ఆకు ,మునగకాయ తాలింపు కూరగాయ తీసుకోవచ్చు కానీ మునగ పువ్వులు ఎలా తినాలి అని డౌట్ కలుగుతుందా.


మునగ పువ్వుతో తయారుచేసిన ఆర్గానిక్ గ్రీన్ టీలు మనకు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. లేదా మీరే కొన్ని మునగ పువ్వులను నీడలో ఎండపెట్టి గ్రీన్ టీ లో మిక్స్ చేసుకుంటే మీ మునగ పువ్వు గ్రీన్ టీ రెడీ అవుతుంది. ఈ మునగ పువ్వుతో కషాయం లాగా కాల్చుకొని కాస్త తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు మునగ పువ్వులోని పోషక విలువలు బాగా అందుతాయి.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి