Morning Walk Side Effects: ప్రస్తుతం ఏ విషయమైన మొబైల్ ఫోన్‌తో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అది లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. అయితే ఫోన్‌ను అతిగా వినియోగించడం వల్ల అనేర రకాల శరీర సమస్యలు వస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో అందులో ఉండే బ్యాటరీలు పేలి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప్రస్తుతం మార్నింగ్‌ వాక్‌ చేసే సందర్భంలో కూడా మొబైల్ ఫోన్‌లను వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల దుష్ర్పభావాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్నింగ్ వాక్‌లో మొబైల్ ఎందుకు వినియోగించకూడదు:


మొబైల్ ఫోన్‌ మానవులకు ఓ చెడు వ్యసనంలా మారింది. మనం మార్నింగ్ వాక్ సమయంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నమంటే ఎంతగా ఫోన్‌కు అడిక్ట్ అయ్యమంటే ఫోన్‌ లేకుండా, దానిని చూడకుండా ఏ పని చేయలేమని తెలుస్తోంది. వాకింగ్ చేసేటప్పుడు అలా చేయడం హానికరమని నిపుణుల తెలుపుతున్నారు. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు మొబైల్ ఎందుకు ఉపయోగించకూడదో తెలుసుకుందాం.


1. అనారోగ్య సమస్యలు:


ఉదయాన్నే నడిచేటప్పుడు నడుము నిటారుగా ఉంచుకోవడంపైనే మన దృష్టి ఉండాలి. కానీ మొబైల్ వాడేటప్పుడు అనుకోకుండా కొద్దిగా వంచాల్సి రావడం వల్ల వెన్నుపాముముకపై చాలా ప్రభావం పడుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.



2. వెన్ను నొప్పి:


మార్నింగ్ వాక్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ పదే పదే వాడడం వల్ల శరీరంలో మార్పులు వచ్చి వెన్నునొప్పికి దారి తీస్తుంది.


3. కండరాలలో నొప్పి:


మనం నడిచేటప్పుడు రెండు చేతులను పైకి క్రిందికి కదిలించాలి. ఇలా చేయడం వల్ల మన చేతుల కండరాలకు వ్యాయామం జరుగుతుంది. అయితే మనం ఒక చేతితో మొబైల్‌ ఫోన్‌ వాడడం వల్ల కండరాల సమతుల్యం తగ్గిపోయి కండరాలలో నొప్పులు వస్తున్నాయి.


4. ఏకాగ్రత అవసరం:


మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు దృష్టి వర్కవుట్‌పై ఉంచాలి. కానీ మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మన దృష్టి  వర్కవుట్‌పై ఉండకుండా ఫోన్ పై ఉంటుంది. దీని వల్ల వాక్‌ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.



(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Banana Flower: రక్త హీనతతో బాధపడుతున్నారా..ఈ పువ్వుతో ఉపసమనం పొందండి..!!


Also Read: Heel Pain: మడమ నొప్పితో బాధపడుతున్నారా..ఈ చిట్కాను పాటించి విముక్తి పొందండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి