Mosambi Juice Benefits: బత్తాయి రసంతో బరువు తగ్గడమే కాదు, కీళ్ల నొప్పులకు కూడా చెక్ పెట్టొచ్చు!
Mosambi Juice Benefits: బత్తాయి రసం తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Mosambi Juice Benefits: బత్తాయి రసం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు ప్రతి సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో అధిక పరిమాణంలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఫోలేట్ లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు బత్తాయితో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీర బరువును తగ్గిస్తుంది:
బత్తాయి రసంలో కేలరీలు, కొవ్వు అతి తక్కువగా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం పూట తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాల పొందుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం:
బత్తాయి రసం ప్రతి రోజు తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన యాసిడ్స్ కూడా లభిస్తాయి. కాబట్టి ఈ రసం తాగడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ పరిమాణాలు కూడా ఉంటాయి. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
రోగనిరోధక శక్తి బలపడుతుంది:
ప్రస్తుతం చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గి, తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు బత్తాయి రసం తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఎముకలు బలపడతాయి:
ప్రతి రోజు బత్తాయి రసం తాగడం వల్ల ఎముకలు కూడా దృఢంగా మారతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కాల్షియం ఎముకల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి:
ఆరేంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో లభించి విటమిన్ సి..తీవ్ర చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు మొటిమలు, మచ్చలు కూడా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి