Mosquitoes Attractive Colours: సాధారంగా దోమలు కొందరినీ మాత్రమే కుడుతుంటాయి.. కొందరిపై అస్సలు వాలవు. ఒకచోట కొంత మంది ఉంటే వారిలో ఏ ఒక్కరినీ ఇద్దరినీ దోమలు కుడితే.. పక్కనున్న వారు మీ రక్తం చాలా తియ్యగా ఉన్నట్లుంది అందుకే దోమలు మిమ్మల్ని కుడుతున్నాయంటూ జోక్‌లు కూడా వేస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దోమలు (Mosquitoes) కేవలం కొందరినీ మాత్రమే కుట్టి.. కొందరినీ కుట్టకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (University of Washington) శాస్త్రవేత్తల నేతృత్వంలో తాజాగా జరిగిన ఒక పరిశోధనలో దోమలకు సంబంధించి పలు కీలక విషయాలు బయటపడ్డాయి.


దోమలు ఎరుపు, ఆరెంజ్, నలుపు, సియాన్‌ వంటి రంగులకు ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతాయని.. అలాగే ఆకుపచ్చ, పర్పుల్, బ్లూ, తెలుపు రంగులను అస్సలు పట్టించుకోవని పరిశోధనలో తేలింది.


అయితే స్కిన్ కలర్, టోన్‌కు సంబంధం లేకుండా దోమలు కుట్టేస్తుంటాయి. సువాసన, వెచ్చదనం వంటి సంకేతాలు దోమలకు వెళ్లాయనుకోండి.. వెంటనే అవి మనకు కావాల్సిన బ్లడ్ (Blood) దొరికే ప్రాంతం దగ్గర్లోనే ఉందంటూ రయ్‌మని వచ్చేస్తుంటాయట.


మానవ చర్మం, (Skin) మొత్తం వర్ణద్రవ్యంతో సంబంధం లేకుండా, వారి కళ్ళకు బలమైన ఎరుపు-నారింజ "సంకేతాన్ని" విడుదల చేస్తుంది కాబట్టి, దోమలు అతిధేయలను ఎలా కనుగొంటాయో వివరించడానికి ఈ పరిశోధనలు సహాయపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు.


ఇక దోమలు కుట్టే ముందు కొన్ని సంకేతాలు వాటికి వెళ్తాయని బయోలజీ యూడబ్ల్యూ ప్రొఫెసర్ జెఫ్రీ రిఫెల్ పేర్కొన్నారు. మన శ్వాసకు సంబంధించిన సీఓ2ను పసిగట్టగలిగే గుణం దోమలకు ఉంటుందని జెఫ్రీ రిఫెల్ తెలిపారు. 


ఫిబ్రవరి 4న పబ్లిష్ అయిన నేచర్ కమ్యూనికేషన్స్‌లో దోమలు వాసనల్ని ఎలా పసి గట్టగలవో క్షుణ్ణంగా వివరించారు. సీనియర్ రచయిత, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ బయాలజీ ప్రొఫెసర్ అయిన జెఫ్రీ రిఫెల్ ఇందులో పలు విషయాలు వెల్లడించారు. అయితే మనం ఏం చేస్తే దోమలు కుట్టకుండా ఉంటాయి అనే ప్రశ్న తన మైండ్‌లోకి రావడంతో ఈ పరిశోధన చేపట్టినట్లు జెఫ్రీ రిఫెల్ తెలిపారు. ఇక పరిశోధలో దోమలు (Mosquito) కుట్టడానికి ప్రధాన కారణాలను రిఫెల్‌ గుర్తించారు. ముఖ్యంగా మన శ్వాస, మన చెమట, స్కిన్‌కు సంబంధించిన టెంపరేచర్ ఆధారంగా దోమలు కుడుతాయని రిఫెల్ చేపట్టిన పరిశోధనలో మొదట తేలింది. అయితే మొదట ఈ మూడు విషయాలు తేలగా.. తర్వాత నాలుగో విషయాన్ని కూడా కనుగొనగలిగారు. 


తాజా అధ్యయనంలో పరిశోధకులు ఆ నాల్గో అంశాన్ని వెల్లడించారు. అదేమింటే కొన్ని రంగులకు దోమలు అట్రాక్ట్ కుట్టేస్తాయని తేలింది. చాలా మంది స్కిన్ టోన్‌ కూడా రెడ్‌గా ఉంటుంది. నలుపు, తెలుపు, గోధుమ రంగులాంటి స్కిన్‌ టోన్‌ ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుట్టవని తేలింది. అయితే ఈ భూప్రపంచంపై ఉన్న జనాల్లో చాలా మంది రెడ్‌ స్కిన్ టోన్ కలిగి ఉన్నారు. కాగా స్కిన్‌ అట్రాక్టివ్‌ కలర్స్‌ను కవర్‌‌ చేసుకోవడం, అలాంటి దుస్తులను ధరించడం వల్ల దోమకాటు నుంచి కాస్త తప్పించుకోవచ్చని జెఫ్రీ రిఫెల్ చెప్పారు.


యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ టీమ్‌ దోమలకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా బయటపెట్టింది. ఫిమేల్ ఎల్లో ఫీవర్ దోమల ప్రవర్తనను కూడా ఈ టీమ్ కనుగొనింది. ఈడెస్ ఈజిప్టి దోమలు  వివిధ రకాల దృశ్యాలు, వాసనలను పసిగట్టగలిగే గుణాలు కలిగి ఉంటాయని పరిశోధనలో తేలింది. అన్ని దోమల జాతుల్లో కేవలం ఆడదోమలు మాత్రమే కుడతాయి, రక్తం తాగుతాయి. ఈజిప్టి కాటు వల్ల డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి.


పరిశోధనలో భాగంగా సీఓ2ను స్ప్రే చేసి తర్వాత కొన్ని రకాల రంగులపై దోమలు అస్సలు వాలలేదు. ఆకుపచ్చ, బ్లూ, పర్పుల్‌ రంగులపై దోమలు అస్సలు వాలలేదు. కానీ ఎరుపు, ఆరెంజ్, నలుపు, బ్లూ రంగులపై మాత్రం దోమలు వాలడం గమనించారు. దోమలు సీఓ2ను ఈజీగా పసిగట్టగలవు. తర్వాత తమకు ఇష్టమైన రంగులపై వాలి అవి కుడతాయి. ఇక దోమలు కొన్ని పువ్వుల్లోని మకరందాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడతాయని పరిశోధనలో తేలింది. 


సో దోమల బారిన పడకుండా ఉండాలంటే అవి ఇష్టపడే రంగుల దుస్తులు (Dresses) ధరించకుండా ఉంటే కాస్త వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇక వాటికి నచ్చిన కలర్ బట్టలు ధరిస్తే మాత్రం దోమలకు (Mosquitoes) పండగే మరి.


Also Read: Asaduddin Owaisi Z security: అసదుద్దిన్ ఒవైసిపై కాల్పులు నేపథ్యంలో ఒవైసికి అమిత్ షా


Also Read: Messages Recovery Android: మొబైల్ లో డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook