Mouth Ulcer Home Remedies: ప్రస్తుతం చాలా మంది నోటి పూతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో తరచుగా ఇబ్బంది పడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అలెర్జీ, హార్మోన్లలో మార్పు, కడుపు ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి నోటిలో బొబ్బలు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోటిలో బొబ్బలు వల్ల చాలా రకాల సమస్యలు రావొచ్చు:
నోటిపూత వల్ల తినడానికి, తాగడానికి అనేక ఇబ్బందులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలను వైద్య భాషలో క్యాంకర్ సోర్ అని కూడా అంటారు. కొన్ని సార్లు నోటి క్యాన్సర్‌కు కారణం కావొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొందరిలో జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నయం కావడానికి 3 వారాలు పట్టవచ్చు. అంతేకాకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు చిట్కాలు పాటించాల్సిందే..


ఈ చిట్కాలు తప్పని సరి:


1. తులసి ఆకులు:
తులసి మొక్కలు ప్రతి ఇంట్లో సర్వసాధరణంగా ఉంటాయి. అంతేకాకుండా విచ్చల విడిగా ఈ ఆకులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు నోటిపూతల నుంచి రక్షించి ఉపశమనం కలిగిస్తాయి.


2. గసగసాలు:
ప్రస్తుతం చాలా మంది నోటిలో బొబ్బలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక చెంచా గసగసాలు గోరువెచ్చని నీటితో ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్యల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.


4. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె నోటిపూత, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెను నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా నోటి అల్సర్లను కూడా నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.


5. లికోరైస్:
లైకోరైస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి అల్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జామపండు గ్రైండ్ చేసి అందులో ఒక చిన్న చెంచా తేనె కలిపి నోటిపూత ఉన్న చోట అప్లై చేసుకోవాలి. దీని వల్ల తొందరలోనే మంచి ఫలితాన్ని పొందుతారు.
(నోట్‌ : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Valentines week: వాలెంటైన్ డే కాదు..వాలెంటైన్ వీక్ ఇది, రేపటితో ఆఖరు


Also Read: Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook