Hing Benefits: మన వంటింట్లో ఎప్పుడూ అవైలబుల్ గా ఉండే మసాలా వస్తువులలో ఇంగువ ఒకటి. ఇది లేకుండా కూరలకి రుచి వాసన రావు. అయితే ఇంగువ కేవలం కూరలకి రుచి పెంచడానికే కాదు.. మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంగువలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే భారతీయ వంటకాలలో దీన్ని విస్తృతంగా వాడడం మన పూర్వీకుల నుంచి మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తరతరాలుగా ఇంగువను ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇంగువ మన జీర్ణవ్యవస్థని బలపరచడంతో పాటు ఉదర సంబంధిత ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చిన్నపిల్లలకు అజీర్తి చేసినప్పుడు ఇంగువను అరగదీసి ఆ పేస్టుని పొట్టకు రాస్తారు. ఇలా చేయడం వల్ల కడుపులో ఉన్న గ్యాస్ సులభంగా పోతుంది. అందుకే మన కూరల్లో ఇంగువ వాడుతాము. ఇంగువ అధిక రక్తపోటుని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.


 ఇంగువ గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఉబ్బసంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కూడా పరిష్కారంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ సుగుణాలు. పొడి దగ్గు ,తలనొప్పి లాంటి సమస్యలతో బాధపడేవారు ఇంగువను ఆహారంలో తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇంగువ పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. కడుపులో అజీర్తిగా ,గ్యాస్ చేరినట్టుగా ..కాస్త వికారంగా అనిపించినప్పుడు.. కాస్త ఇంగువను వేయించి పొడి చేసుకుని ఆ మిశ్రమానికి ఉప్పు జోడించి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. పంటి నొప్పి కలిగినప్పుడు సడన్గా డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి కుదరనప్పుడు ఇంగువను అరగదీసి నొప్పి ఉన్న పంటి మీద పూయడం వల్ల టెంపరరీ రిలీఫ్ కలుగుతుంది.


పీరియడ్ పెయింట్స్ తో బాధపడేవారు కాస్త వేయించిన ఇంగువ మొక్కను పొడి చేసుకుని వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. డయాబెటిస్తో బాధపడే వారికి కూడా ఇంగువ మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్లు కాకరకాయ ఇంగువ కూర చేసి వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందుతారు.


గమనిక :పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు


Also Read: Union Budget 2024 IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter