Muskmelon: ఎండాకాలంలో శరీరం చల్లదనం కోసం చాలా రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పండ్లను ఓ ప్రత్యేక సమయంలో తింటేనే శరీరానికి తగిన లాభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రయోజనానికి మించి (అతిగా)తింటే నష్టం కూడా జరిగే అవకాశాలున్నాయని వారు తెలుపుతున్నారు. కర్బూజ(Muskmelon) పండును కూడా ప్రత్యేక సమాయంలో తినాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి ఈ పండును తినడానికి సరైన సమయమేమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఉదయాన్నే కర్బూజ(Muskmelon) తినోచ్చ..తినరాద..?


కర్బూజలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా 90 శాతం నీరు కూడా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో నీటి కొరత ఉండదు. దీని వినియోగం ద్వారా అనేక వ్యాధులు కూడా తొలగిపోతాయి. అయితే ఉదయాన్నే తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీనిని ఖాళీ కడుపుతో తింటే కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని తెలుపుతున్నారు.


కర్బూజ(Muskmelon) తినడం ద్వారా మీరు ఈ ప్రయోజనాలను పొందుతారు:


- కర్బూజ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతమై.. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు సమస్యల నుంచి దూరం చేస్తుంది.


- పుచ్చకాయ పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో  అధికంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల పొట్టను శుభ్రపరిచి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.


- బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చాలా సహాయపడుతుంది.


- ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనితో చర్మం మెరవడమే కాకుండా.. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.


- ఇది రాత్రిపూట తినకూడదని..దీనిని తినడానికి కేవలం మధ్యాహ్నం సమయం సరైనదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Saunf Tips: సోంపు తినడం మంచిదా కాదా..ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి


Also Read: Benefits Of Pumpkin Seeds: ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా గుమ్మడికాయ గింజలను తినండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి