Nail Care Tips: దేహ సౌందర్యం, చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో గోర్ల సంరక్షణ కూడా అంతే అవసరం. లేకపోతే గోర్ల ఫంగస్ సమస్యగా మారుతుంది. గోర్ల ఫంగస్ నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో చర్మం ప్రాధాన్యత ఎంతగా ఉంటుందో గోర్లు కూడా అంతే. గోర్లు వేళ్లకు పటుత్వాన్ని, అందాన్ని ఇస్తాయి. అంతేకాదు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడేది కూడా అవే. అందుకే గోర్ల సంరక్షణ చాలా అవసరం.


మనిషి శరీరంలో గోర్లను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. గోర్లు విరిగినా లేదా గోర్లకు దెబ్బ తగిలినా లేదా గోర్లు శుభ్రంగా లేకపోయినా ఫంగస్ వ్యాపిస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో గోర్ల ఫంగస్ దూరం చేయవచ్చచంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. శరీరంలో పోషక పదార్ధాల కొరత లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే ముందుగా లక్షణం కన్పించేది గోర్లపైనే. నెయిల్ ఫంగస్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే వెంటనే నియంత్రించవచ్చు. 


గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు వాము నూనె వాడితే మంచి ఫలితాలుంటాయి. అయితే వాము నూనెను నేరుగా అప్లై చేయకూడదు. రెండు మూడు డ్రాప్స్ వాము నూనె సరిపోతుంది. చిన్న స్పూన్ కొబ్బరి నూనె లేదా జైతూన్ ఆయిల్‌లో వాము నూనె మిక్స్ చేసి..గోర్లపై రాయాలి. ఇలా చేస్తే నెయిల్ ఫంగస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 


వెనిగర్ అనేది యాంటీ మైక్రోబియల్. చర్మంపై ఏ విధమైన ఫంగస్ ఉన్నా దూరం చేస్తుంది. ఒక కప్పు వెనిగర్‌లో 4 కప్పుల నీళ్లు మిక్స్ చేయాలి. ఈ నీళ్లలో చేతులు, కాళ్లను ముంచాలి. 20 నిమిషాల తరువాత చేతులు, కాళ్లను పొడిగుడ్డతో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ ఫంగస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 


కొబ్బరి నూనె ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు చాలా మంచిది. గోర్ల ఆరోగ్యం కోసం కూడా కొబ్బరి నూనె వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెను గోర్లపై నేరుగా అప్లై చేయవచ్చు. దీనివల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్, స్వెల్లింగ్ దూరమౌతుంది. 


Also read: Brown Rice Benefits: వైట్ రైస్..బ్రౌన్ రైస్‌కు తేడా ఏంటి, వైట్ రైస్ వల్ల కలిగే లాభాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook