New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి
Coronavirus Symptoms In Telugu | గతంలో కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాసన మరియు రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్య వంటి లక్షణాలు ఉండేవని వైద్యులు తెలిపారు.
New Coronavirus Symptoms: గత నెల రోజుల నుంచి భారత్‌లో కోవిడ్19 మహమ్మారి అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత ఏడాది ఒక్కరోజు సైతం లక్ష కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ ఈ ఏప్రిల్ వరుసగా గడిచిన 24 గంటల్లో లక్షకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తాజాగా 1,26,789 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 685 మరణాలు సంభవించాయి.
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 1,66,862కి చేరింది. మరోవైపు కరోనా వైరస్ బాధితులలో లక్షణాలు సైతం భిన్నంగా కనిపిస్తున్నాయి. గతంలో కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాసన మరియు రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్య వంటి లక్షణాలు ఉండేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో భిన్నమైన కరోనా లక్షణాలను వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా వైరస్(CoronaVirus) తీరు మారిందని, లక్షణాల మార్పు కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 2 వేలు పైగా పాజిటివ్ కేసులు
కరోనా రెండో దశలో లక్షణాలు ఇవే..
ప్రస్తుతం కోవిడ్19(COVID-19) పాజిటివ్‌గా తేలిన వారిలో కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, వినికిడి సమస్య, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో డాక్టర్లు అధికంగా ఈ కేసులను గుర్తించారు. వాపు, కళ్లళ్లో నీరు కారడం లాంటి లక్షణాలు గుర్తించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: COVID-19 Cases India: భారత్ ప్రయాణికులపై నిషేధం విధించిన న్యూజిలాండ్, కోవిడ్19 భయం
కోవిడ్19 నిబంధనలు పాటించాలి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కోవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించారు. ఇతరుల నుంచి భౌతిక దూరం, ఇంటి నుంచి బయటకు వెళితే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైన సమయంలో శానిటైజర్ వినియోగించడం చేస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. మాస్కులను ముక్కు, నోరు, దవడ భాగాలను సరిగ్గా కప్పి ఉంచేలా ధరించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook