భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజూ లక్షకు పైగా నమోదువుతున్న తరుణంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణికులపై ట్రావెన్ బ్యాన్ విధించారు. భారత్‌లో కోవిడ్19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ గురువారం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి భారతీయులతో పాటు తమ దేశ పౌరులను సైతం ఏప్రిల్ 28 వరకు స్వదేశానికి అనుమతించడం లేదని తెలిపారు.
ఏప్రిల్ 11 (ఆదివారం) నుంచి ప్రయాణాలపై నిషేధం నిర్ణయం అమలులోకి రానుంది. గురువారం మీడియా సమావేశంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ తన నిర్ణయాలన్ని వెల్లడించారు. కరోనా వ్యాప్తిని తమ దేశంలో అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతానికి ఏప్రిల్ 28వ తేదీ వరకు భారత్(India) నుంచి ఏ ఒక్కరినీ తమ దేశంలో అడుగుపెట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు. కరోనా ముప్పు పొంచి ఉందని భావిస్తున్న దేశాల నుంచి ట్రావెల్ బ్యాన్(Travel Ban) విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 2 వేలు పైగా పాజిటివ్ కేసులు
కరోనా మహమ్మారి(COVID-19) అనేది ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదని, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పేర్కొన్నారు. పలు దేశాల ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకుని 72 గంటల్లోగా ప్రయాణాలు చేస్తున్న వారిని అనుమతిస్తున్నాయి. గత ఏడాది సైతం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశంగా న్యూజిలాండ్ నిలవడం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మరణాలు పెరుగుతున్న క్రమంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది.
కాగా, భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న గత ఏడాది సమయంలో సైతం ఒకరోజులో లక్ష కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ ఈ ఏప్రిల్ నెలలో భారత్‌లో వరుసగా లక్షకు పైగా కోవిడ్-19 కేసులు నిర్ధారణ అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తాజాగా 1,26,789 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 685 మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 1,66,862కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య సంక్షేమశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Gold Price Today 08 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook