Sweating Reasons: ఆధునిక జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. కొన్ని సాధారణం కావచ్చు..మరికొన్ని ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా రాత్రిళ్లు చెమట్లు పడుతుంటే మాత్రం..నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్య నిపుణులు..ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేకమైన కారణం లేకుండా శరీరంలో ఏ మార్పూ జరగదు. ప్రతి మార్పుకు ఓ కారణముంటుంది. ఆ కారణాలు ఒక్కోసారి సాధారణం కావచ్చు..చాలా సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. సమస్యలు ఎదురైనప్పుడు వైద్యుని సంప్రదిస్తే ఎందుకనేది తెలుసుకోవచ్చు. లైట్‌గా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఎందుకంటే ప్రాణాంతక కేన్సర్ వ్యాధులకు సంకేతాలు ఒక్కోసారి సాధారణంగానే ఉంటుంటాయి. అటువంటివాటిలో రాత్రిళ్లు చెమట్లు పట్టడం ఒకటి. 


సాధారణంగా చెమట పట్టడం సహజ లక్షణమే. ఆ చెమట వేడి వల్ల కావచ్చు, ఉక్కపోత వల్ల కావచ్చు, శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పుల వల్ల కావచ్చు. కారణమేదైనా చెమట్లు పట్టినప్పుడు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రాత్రిపూట చెమట పట్టడమనేది ప్రమాదకర వ్యాధికి సంకేతమంటున్నారు వైద్యులు. 


చెమట్లు ఎందుకొస్తాయి


పగటి పూట చెమటలొస్తే ఆరోగ్యానికి మంచిదే. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలకు రాత్రి పూట చెమటలు పడుతుంటాయి. అయితే రాత్రి పూట చెమటలు మరో కారణం కూడా ఉంటుంది. ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ కారణంగా అకారణంగా చెమటలు పడుతుంటాయి రాత్రిపూట. ఇక క్షయ వ్యాధి ఉన్నవారికి కూడా రాత్రి పూట చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. ఎండో కార్డిటిస్, ఆప్టియోమైలిటిస్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారికి కూడా రాత్రి సమయంలో చెమటలు అధికంగా వస్తుంటాయి. అటు హెచ్‌ఐవీ బాధితులకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. 


కేన్సర్‌కు సంకేతం 


మరీ ముఖ్యంగా లింఫోమా వంటి కొన్ని కేన్సర్ వ్యాదులకు చెమటలు పట్టడం ప్రారంభ లక్షణం. మనం వివిధ సమస్యల కారణంగా తీసుకునే మందుల వల్ల కూడా కొన్నిసార్లు చెమటలు పడుతుంటాయి. ఆస్పిరిన్, ఎసిటమినోపైన్ వంటి జ్వరాన్ని తగ్గించే మాత్రలతో కూడా చెమటలు పడతాయి. 


ఇక అన్నింటికంటే ముఖ్యమైంది రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు. మధుమేహాన్ని నియంత్రించే మందుల వల్ల కూడా రాత్రిళ్లు చెమటలు పడుతుంటాయి. ఇక కార్సినోయిడ్ సిండ్రోమ్, ఫిరయోక్రోమోసైటోమా, హైపర్ థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యలున్నవారికి రాత్రి సమయంలో పెద్దఎత్తున చెమటలు పడతాయి. అందుకే సాధ్యమైనంతవరకూ చెమటలు పట్టినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిది.


Also read: Green Chillies Benefits: పచ్చిమిర్చితో కలిగే ఆ ఐదు ప్రయోజనాలు తెలిస్తే..ఇక వదిలిపెట్టరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి