COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Benefits Of Nutmeg: మనం ప్రతిరోజు వంటల్లో అనేక రకాల మసాలా దినుసులను వినియోగిస్తూ ఉంటాము. చాలామంది సలాడ్స్ లో కూడా మసాలా దినుసులతో తయారు చేసిన మసాలాలను వినియోగిస్తూ ఉంటారు. మసాలా దినుసులను వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది మసాలాలో ఎక్కువగా జాజికాయ పొడిని వినియోగిస్తూ ఉంటారు. ఈ జాజికాయను వినియోగించడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఏర్పడే అజీర్ణం కడుపు ఉబ్బరం వంటి సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.



దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు డైట్ తో పాటు ఓట్ మిల్ను అనుసరిస్తున్న వారు తప్పకుండా జాజికాయతో తయారుచేసిన పొడిని వినియోగించాలి. కాకుండా రాత్రి పడుకునే ముందు పాలలో ఈ పొడిని కలుపుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. జాజికాయ‌లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ వాపుల వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి. జాజికాయ ప్రతిరోజు వాడడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాజికాయను ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి జాజికాయ పొడిని ప్రతిరోజు ఆహారాల్లో తప్పకుండా వినియోగించాలి అంతేకాకుండా గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కూడా శరీరంలోని కొలెస్ట్రాలను సులభంగా  నియంత్రించుకోవచ్చు. 


అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాజికాయ పొడిని వినియోగించాల్సి ఉంటుంది ఈ పొడిలో ఉండే గుణాలు మానసిక సమస్యలను కూడా సులభంగా దూరం చేస్తాయి. కాబట్టి ఆఫీసుల్లో ఒత్తిడి కారణంగా స్ట్రెస్కు గురయ్యేవారు తప్పకుండా ఈ పొడిని వినియోగించాల్సి ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి