onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!
Onion Hair Growth Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టును అందంగా ఉంచుకోవాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రస్తుతం చాలా మంది జుట్ట రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలు, జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారుతుంది.
Onion Hair Growth Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టును అందంగా ఉంచుకోవాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రస్తుతం చాలా మంది జుట్ట రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలు, జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో జుట్టును సంరక్షించుకోవాడానికి అనేక ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. అయితే నిపుణులు సూచించిన ప్రకారం..ఇంట్లో ఉండే వస్తువులతో జుట్టును రక్షించుకోవచ్చని తెలుపుతున్నారు. ఇంట్లో ఉండే ఉల్లిపాయను ఉపయోగించి జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా ఉల్లిపాయలో ఉండే గుణాలు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీనిని ఉపయోగించి జుట్టును ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఉల్లిపాయతో ఇలా జుట్టుకు పట్టించుకోండి:
ఈ రెమిడీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ రసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, విటమిన్ ఇ క్యాప్సూల్
దీనిని ఎలా తయారు చేసుకోవాలి:
ముందుగా ఉల్లిపాయను తురుముకొని దాని రసాన్ని తీయండి. మీరు కావాలంటే ఉల్లిపాయను మిక్సర్ గ్రైండర్లో రుబ్బుకొని రసాన్ని తీయోచ్చు. దీని తర్వాత మీరు ఆ రసంలో ఒక టెబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పోయాలి. అంతే కాకుండా ఒక విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని మిశ్రమాన్ని అందులో పోయాలి. ఇప్పుడు దీనిని ఓ స్ప్రే బాటిల్లో వేసి వాడండి.
Also Read: White Hair Treatment: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోండి..!!
హెయిర్‌కు స్ప్రే ఎలా చేయాలి?:
మీరు దీనిని రాత్రి పడుకునే ముందు వెంట్రుకలకు ఈ స్ప్రేని ఉపయోగించడం మంచిది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు మీ జుట్టు పొడిగా ఉండాలి. దీనిని ఉపయోగించిన తర్వాత నూనెతో మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత తేలికపాటి చేతులతో జుట్టుకు మసాజ్ చేసి ఆపై జుట్టును కడగాలి.
ఉల్లిపాయ రసం యొక్క ప్రయోజనాలు:
ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం ద్వారా మీ జుట్టును దృఢంగా మార్చుకోవచ్చు. జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే మీరు స్కాల్ప్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటే దీనిని అప్లై చేయకపోవటం మంచిది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: CNG Car Tips: వేసవిలో CNG వాహనదారులు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook